Baking Soda: బేకింగ్ సోడా ఇంట్లో ఉంటే ఈ 6 ఇంటి పనులు చకచకా పూర్తి చేయవచ్చు..
Baking Soda Hacks: బేకింగ్ సోడా తో పువ్వులు ఎక్కువ కాలం పాటు కూడా నిల్వ ఉంటాయి .ఫ్లవర్ వేజ్ నీటిలో బేకింగ్ సోడాను కలిపితే ఎక్కువ రోజులపాటు పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. అంతేకాదు నీళ్లు నీచు వాసన రాకుండా ఉంటుంది.
Baking Soda Hacks: బేకింగ్ సోడా రసాయనిక నామం NAHCO3. దీన్ని సోడియం బై కార్బోనేట్, బై కార్బోనేట్ ఆఫ్ సోడా, బేకింగ్ సోడా ప్లెయిన్ సోడా అని కూడా పిలుస్తారు. ఇందులో మ్యాజికల్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మన వంటగదిలో ఇది కచ్చితంగా ఉంటుంది. అయితే బేకింగ్ సోడా ఉంటే మనం వంటలు మాత్రమే కాదు దీంతో కొన్ని ఇంటి పనులు కూడా చకచగా పూర్తవుతాయి. ముఖ్యంగా మన వంట పాత్రలను తళతళా మెరిపిస్తుంది అది ఎలాగో తెలుసుకుందాం.
బేకింగ్ సోడా తో పువ్వులు ఎక్కువ కాలం పాటు కూడా నిల్వ ఉంటాయి ఫ్లవర్ వాస్ నీటిలో బేకింగ్ సోడాను కలిపితే ఎక్కువ రోజులపాటు పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. అంతేకాదు నీళ్లు నీచు వాసన రాకుండా ఉంటుంది.
బేకింగ్ సోడాతో మనం ఇంటి వంట పాత్రలను కూడా మెరిపించవచ్చు దీనివల్ల పాత్రలకు మెరుపు కూడా వస్తుంది బేకింగ్ సోడా తో సులభంగా తొలగించవచ్చు రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక వేడి నీటి బౌల్‌లో కలిపి డిష్ వాష్ లిక్విడ్ కూడా దానికి కలిపి ఈ పాత్రలను శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల పాత్రలు కొత్త వాటిలా తల తల మెరిసిపోతాయి
అంతేకాదు బేకింగ్ సోడాతో చాపింగ్ బోర్డులు, కుకింగ్ యుటెన్సిల్స్ అన్ని శుభ్రం చేయవచ్చు. బాగా నీచువాసన పాడైన వస్తువుల వాసన వచ్చినప్పుడు అంటే మనం చాపింగ్ బోర్డ్ పై వెల్లుల్లి, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు వాసన త్వరగా పోదు బేకింగ్ సోడాతో మీరు చాపింగ్ బోర్డు శుభ్రం చేస్తే త్వరగా దుర్వాసన వెళ్ళిపోతుంది.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ఏ పిండి బెస్ట్.. 5 ఆరోగ్యకరమైన పదార్థాలు మీ బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెడతాయి..
అంతేకాదు బేకింగ్ సోడాను ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల ఫ్రీజ్ నుంచి వచ్చే దుర్వాసన కూడా చెక్ పెట్టవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో బేకింగ్ సోడా పోసి ఫ్రిజ్లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్లో ఉన్న దుర్వాసనను అది గ్రహించేస్తుంది. అంతేకాదు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు కూడా బేకింగ్ సోడాను ఉపయోగించి షెల్ఫులు క్లీన్ చేస్తే తల తల మెరిసిపోతాయి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది
మనం బయట నుంచి తెచ్చిన ఏ కూరగాయలు, పండ్లు అయినా బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనం శుభ్రం చేసే నీటిలో బేకింగ్ సోడాను కూడా కలిపితే వాటిపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగిపోతుంది.
ఇదీ చదవండి: రుచికరమైన చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఎవరు చేసినా రుచి అదిరిపోతుంది..
అంతేకాదు కొన్ని కొన్ని కప్పులు, మగ్గులపైన మొండి మరకలు అలాగే ఉండిపోతాయి బేకింగ్ సోడాతో వీటిని తొలగించవచ్చు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలు వేడి నీటిలో వేసుకొని ఒక మగ్గులో సొల్యూషన్ ల తయారు చేసుకోవాలి దీన్ని బేకింగ్ క్యాప్ ఫ్యాన్ వాటికి తో శుభ్రం చేస్తే మరకలు తొలగిపోతాయి ఎక్కువ రోజులపాటు నల్లగా మాడిన పాత్రలను కూడా బేకింగ్ సోడాతో సులభంగా వదిలించుకోవచ్చు
అందుకే బేకింగ్ సోడాను కిచెన్ కింగ్ అని కూడా పిలుస్తారు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter