Banana Face Pack: ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే కాంతివంతమైన చర్మం మీసొంతం..!
Banana Face Pack: అరటిపండు అనేది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, సహజ నూనెలు చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
Banana Face Pack: అరటిపండు చర్మ సంరక్షణలో ఒక అద్భుతమైన సహజ పదార్థం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది. అరటిపండుతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడమే కాకుండా, చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అరటిపండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అరటిపండులో ఉండే నాచురల్ ఆయిల్స్ చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు, చర్మం వడలిపోవడం వంటి వృద్ధాప్య చిహ్నాలను తగ్గిస్తాయి.
అరటిపండు ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలి?
అరటిపండు ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మాల వారు ఉపయెగించవచ్చు. దీని ఉపయోగించడం వల్ల సహజమైన కాంతి కలుగుతుంది. ఏ ఏ చర్మాలవారు అరటిపండు ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
సాదా అరటిపండు ప్యాక్: పండిన అరటిపండును మెత్తగా మాసి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
పొడి చర్మం: అరటిపండు + తేనె: పండిన అరటిపండును మెత్తగా మాసి, అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
జిడ్డు చర్మం: అరటిపండు + నిమ్మరసం: అరటిపండు పేస్ట్‌కు కొద్దిగా నిమ్మరసం కలపండి. నిమ్మరసం చర్మాన్ని తైలాన్ని తగ్గిస్తుంది.
మొటిమలు ఉన్న చర్మం: అరటిపండు + వేపాకు రసం: అరటిపండు పేస్ట్‌కు కొద్దిగా వేపాకు రసం కలపండి. వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
కాంతివంతమైన చర్మం కోసం: అరటిపండు + అవకాడో: అరటిపండు మరియు అవకాడో రెండింటినీ మెత్తగా మాసి కలిపి ముఖానికి అప్లై చేయండి. అవకాడో చర్మాన్ని పోషిస్తుంది.
అరటిపండు ఫేస్ ప్యాక్‌లను ఎలా వాడాలి?
ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తయారు చేసిన ప్యాక్‌ను ముఖం మొత్తానికి సమానంగా అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. చల్లటి నీటితో కడగాలి. మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
ముఖ్యమైన విషయాలు:
బాగా పండిన అరటిపండును ఉపయోగించండి. కొత్త ఫేస్ ప్యాక్‌ను ముందుగా చిన్న భాగంలో పరీక్షించి, అలర్జీ ఉందా లేదా చూసుకోండి. వారానికి 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం మంచిది. ఏదైనా చర్మ సమస్య ఉంటే, చర్మ నిపుణుల సలహా తీసుకోండి. అరటిపండుతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు మీ చర్మాన్ని సహజంగా మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter