Sabja Seeds Benefits: వేసవి స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో తగినంత నీరు అందకపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాకుండా మీరు ఎండా కాలంలో హీట్ వేవ్ బారిన పడే అవకాశం కూడా ఉంది. శరీరంలోని వేడిని తగ్గించడంలో సబ్జా గింజలు అద్బుతంగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్స్, పైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను పచ్చిగా తినలేం. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత తీసుకుంటే మీరు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఇది కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. సబ్జా గింజల ప్రయోజనాలేంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సబ్జా గింజల ఉపయోగాలు


** సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించడంలో సూపర్ పనిచేస్తుంది. ఆకలి కూడా పెద్దగా వేయదు. 
** ఇవి డయాబెటిక్ రోగులకు వరమనే చెప్పాలి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. 
** సబ్జా గింజలు ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడతాయి. 
** అసిడిటీ, ఛాతిలో మంటలను తగ్గించడంలో సబ్జా గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. దీంతోపాటు కడుపను క్లీన్ చేస్తుంది. 
** సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు రావు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
** సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జట్టు కుదుళ్లు ధృడంగా, ఒత్తిగా ఉంటాయి. 
** సబ్జా గింజల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పితోపాటు దగ్గు, జలుబు వంటి వ్యాధులను నియంత్రిస్తాయి. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS TELUGU దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Turmeric Milk Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు పసుపు పాలు అస్సలు తాగకూడదు! 


Also Read: Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook