How To Make Vitamin E Face Pack: విటమిన్ ఇ క్యాప్సూల్ శరీరానికే కాకుండా చర్మానికి, జుట్టుకు చాలా రకాలుగా సహాయపడుతుంది. అయితే వేసవి కాలంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో వృద్ధాప్య సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ ఇ క్యాప్సూల్(Vitamin E) వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా విటమిన్ ఇ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వినియోగిస్తే చర్మం లోపలి నుంచి తేమను అందిస్తుంది. కాబట్టి ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఇ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే:
2 విటమిన్ ఇ క్యాప్సూల్
2 చెంచాల ముల్తానీ మిట్టి
నీరు అవసరమైనంత
2 చెంచాల రోజ్ వాటర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ ఇ ఫేస్ ప్యాక్ తయారి విధానం:
ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో రెండు చెంచాల ముల్తానీ మిట్టి తీసుకోవాలి.
అదే గిన్నెలో ఒక చెంచా రోజ్ వాటర్ వేయాలి.
2 విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ అయిల్‌ వేసి మిక్స్‌ చేసుకోవాలి.
అందులోనే తగినంత నీరును వేసి బాగా మిక్స్‌ చేయాలి.
ఇలా అన్నింటిని కలుపుకుని మిశ్రమంలా చేసుకుంటే చాలు విటమిన్ ఇ ఫేస్ ప్యాక్ (Vitamin E Face Pack) తయారైనట్లే..


Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్‌ 203 మాత్రం..! 


వినియోగించే విధానం:
ఈ ఫేస్ ప్యాక్ వినియోగించేదాని ముందు ఫేస్‌ను వాష్ చేయాల్సి ఉంటుంది.
ఇలా మిశ్రమంలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్‌ను ముఖంపై బాగా అప్లై చేయాలి.
అప్లై చేసిన తర్వాత సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది.
తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్‌ 203 మాత్రం..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.