Beerakaya Perugu  Recipe: బీరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చి ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడం నుంచి చర్మ ఆరోగ్యం వరకు బీరకాయ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీరకాయలో ఉండే పదార్థాలు మన రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.  అయితే   బిరకాయతో కొన్ని రకాల వంటకాలు చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బీరకాయ , పెరుగు కలిపి చేసే ఈ కూర ఎంతో రుచిగా  ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


బీర‌కాయ పెరుగు కూరకి కావ‌ల్సిన ప‌దార్థాలు: 


పావుకిలో త‌రిగిన బీర‌కాయ‌లు, 3 టీ స్పూన్స్ శ‌న‌గ‌పిండి,  ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ నూనె, చిన్న‌గా త‌రిగిన అల్లం, త‌రిగిన ప‌చ్చిమిర్చి , త‌రిగిన ఉల్లిపాయ ఒకటి, త‌రిగిన ట‌మాటాలు రెండు, ఉప్పు  త‌గినంత‌, పెరుగు  ఒక క‌ప్పు,  పావు టీ స్పూన్  ప‌సుపు, ఒక క‌ప్పు నీళ్లు , కొంచెం త‌రిగిన కొత్తిమీర, ముడూ దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు, రెండు ఎండుమిర్చి , అర టీ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ జీల‌కర్ర, పావు టీ స్పూన్  ఇంగువ.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


బీర‌కాయ పెరుగు కూర త‌యారు చేసే విధానం: 


ముందుగా కళాయిలో శనగపిండి తీసుకొని మూడు నిమిషాల పాటు  వేయించి పక్కకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి.  ఇందులోకి పసుపు, నీళ్లు, శనగపిండిని వేసి కలుపు కొన్ని పక్కన ఉంచాలి.  తరువాత నూనె వేడి చేసి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ,టమాట, బీరకాయ , ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మగ్గించాలి. 


త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి.  మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి.  కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ పెరుగు కూర త‌యార‌వుతుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter