Beetroot Puri Recipe In Telugu: బీట్రూట్‌లో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు ఈ బీట్రూట్‌ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా దీనిని సలాడ్‌గా తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే చాలా మంది నార్డ్‌ ఇండియన్స్‌ ఈ బీట్రూన్‌ను పూరీల్లో కూడా వినియోగిస్తారు. దీనితో తయారు చేసిన పూరీలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మీరు కూడా బీట్రూట్‌తో పూరీలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై ఇలా ట్రై చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు:
బీట్రూట్లు - 2 
గోధుమ పిండి - 2 కప్పులు
నూనె - వేయడానికి తగినంత
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - 1/2 టీస్పూన్
కరివేపాకు - కొన్ని రెమ్మలు
ఎండు మిరపకాయలు - 2-3
కొత్తిమీర - కొద్దిగా


తయారీ విధానం:
బీట్రూట్‌ను ఉడికించుకోవడం:
ముందుగా ఈ పూరీలను తయారు చేసుకోవడానికి బీట్రూట్‌లను బాగా కడిగి, ఒక పాత్రలో వేసి నీరు పోసి మొత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లార్చి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
పేస్ట్ తయారు చేసుకోవడం: ఉడికించి కోసిన బీట్రూట్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
పిండి కలిపడం: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. బీట్రూట్ పేస్ట్‌ను కూడా దీనిలో కలిపి మెత్తగా పిండిని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
పూరీలు వేయడం: పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి.. చపాతిలా వంటి ఆకారంలో పూరీలను చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి, ఈ పూరీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు బాగా కల్చుకోవాలి.
వండించుకోండి: వేయించిన పూరీలను ఒక ప్లేట్‌లో వేసుకుని పూదినా చట్నీ లేదా బొంబాయి చట్నీతో తినండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.