Belly Fat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ప్రధాన సమస్యగా మారాయి. వంటింట్లో లభించే కొన్ని సాధారణ పదార్ధాలతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. బెల్లీ ఫ్యాట్ దూరం చేయవచ్చు. ఎలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కొన్ని భాగాల్లో అనవసర ఫ్యాట్ పేరుకుపోతుంటుంది. పొట్టపై, నడుముపై పేరుకున్న ఫ్యాట్‌ను అంత సులభంగా తొలగదు. దీన్నే బెల్లీ ఫ్యాట్ అని పిలుస్తుంటాం. మనిషి శరీరాకృతిపై ఇది ప్రభావం చూపిస్తుంది. బెల్లీ ఫ్యాట్ అనేది శరీరంలోని మెటబాలిజం మందగించేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు ఎక్కువౌతుంది. అయితే కొన్ని సులభమైన పదార్ధాలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. నెమ్మదిగా దీర్ఘకాలంలో కచ్చితంగా పనిచేస్తుందంటున్నారు. ఆ వివరాలు చూద్దాం..


అల్లం టీ, యాపిల్ సైడర్ వెనిగర్


అల్లం టీ అనేది ఓ చికిత్స విధానం లాంటిదే. అదే సమయంలో బరువు తగ్గేందుకు ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు కూడా ఉపయోగపడుతుంది.  ఇది మీ శరీరంలో ధెర్మోజెనిక్‌లా పనిచేస్తుంది. అంటే శరీరంలోపలి ఉష్ణోగ్రత పెంచి..లోపలున్న ఫ్యాట్ కరుగుతుంది. ఇక రెండవది యాపిల్ సైడర్ వెనిగర్. ప్రతి వంటలో రుచి కోసం వాడుతుంటారు. కానీ పొట్ట బాగంలో బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.  మీ ఆకలిని తగ్గించడం ద్వారా ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. భోజనానికి ముందు 1-2 స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం మంచిది.


బాదం, వెల్లుల్లి


పొట్ట భాగంలో ఉండే కొవ్వును కరిగించేందుకు బాదం చాలా బాగా దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే కేలరీలు మంచిది కాకపోయినా..బరువు తగ్గేందుకు మాత్రం ఉపయోగపడతాయి. బాదంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందుకు దోహదపడతాయి. ఇక నాలుగవది వెల్లుల్లి. వెల్లుల్లి అద్భుతమైన, శక్తివంతమైన ఆహార పదార్ధం. వెల్లుల్లి అనేది శరీరంలోని బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుందని చాలా అధ్యయనాల్లో రుజువైంది. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి 1-2 తొనలు తింటే..రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అటు కొవ్వు కరుగుతుంది. 


ఇక అల్లోవెరా జ్యూస్ కూడా బరువు తగ్గేందుతు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే స్టెరాల్స్ కొవ్వును కరిగించేస్తాయి. కానీ అల్లోవెరా ఎప్పుడూ పరిది దాటి వినియోగించకూడదు. 


Also read: Face Care Tips: ముఖానికి సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన చిట్కా, ఇలా ట్రై చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.