Face Care Tips: ముఖానికి సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన చిట్కా, ఇలా ట్రై చేయండి

Face Care Tips: ముఖ సౌందర్యం కోసం మన చుట్టూ లభించే సహజ చిట్కాలను వదిలేసి..మార్కెట్‌లో లభించే క్రీముల వెంట పరుగెడుతుంటాం. సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే ఈ చిట్కా ట్రై చేస్తే ఇక బంగారు కాంతి మీ సొంతం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2022, 09:30 PM IST
 Face Care Tips: ముఖానికి సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన చిట్కా, ఇలా ట్రై చేయండి

Face Care Tips: ముఖ సౌందర్యం కోసం మన చుట్టూ లభించే సహజ చిట్కాలను వదిలేసి..మార్కెట్‌లో లభించే క్రీముల వెంట పరుగెడుతుంటాం. సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే ఈ చిట్కా ట్రై చేస్తే ఇక బంగారు కాంతి మీ సొంతం..

ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్ధాల్లోనే ముఖ, చర్మ సౌందర్య ఔషధాలు దాగుంటాయి. తెలుసుకుని అమలు చేస్తే అంతకుమించింది వేరే ఉండవు. ఇందులో ముఖ్యమైంది పాలు. పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో..పాలలో ఉండే పదార్ధాలు సౌందర్య సంరక్షణకు అంతే ఉపయోగకరం. ముఖ సౌందర్యానికి పాల మీగడ చాలా లాభదాయకం. ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..

ముఖ సౌందర్యానికి, ముఖం బంగారు రంగులో మెరిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వివిధ రకాల ఫేస్‌క్రీమ్స్ రాస్తుంటారు. కానీ అన్నింటికంటే ఎక్కువగా ఉపయోగకరమైన సహజసిద్ధమైన పదార్ధాన్ని మాత్రం పట్టించుకోరు. ఇంట్లో విరివిగా లభించే పదార్ధమే అది. అదే పాల మీగడ. ముఖానికి పాలమీగడ రాసుకుంటే మీ ముఖం అద్భుతమైన కాంతితో వెలిగిపోతుంది. ఎలా చేయాలి, ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పాలమీగడలో కొన్ని రకాల పదార్ధాలు కలిపి రాసుకుంటే ఇంకా ప్రయోజనకరమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని మెరిసేలా చేసేందుకు ఇదే అత్యుత్తమ పద్ధతి. ఒక స్పూన్ మీగడలో ఒక స్పూన్ శెనగపిండి కలపాలి. ఈ పేస్ట్‌ను మీ చర్మంపై 20 నిమిషాలసేపు రాయాలి. ముఖం బంగారు వర్ణంతో మెరిసేందుకు ఈ పద్ధతి చాలా దోహదపడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మరకలు తొలగిపోతాయి. 

పాలమీగడ అనేది చర్మాన్ని లోపలివరకూ మాయిశ్చరైజ్ చేస్తుంది. దాంతోపాటు చర్మంపై ఉండే అన్ని డెడ్ సెల్స్‌ను తొలగిస్తుంది. ఒక స్పూన్ పాలమీగడను కొద్దికొద్దిగా ముఖంపై రాసుకోవాలి. కనీసం 15 నిమిషాలసేపు మాలిష్ చేసుకోవాలి. ఆ తరువాత చల్లని లేదా గోరు వెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి. సహజ సిద్దమైన సౌందర్యం కోసం పాల మీగడకు మించిన ప్రత్యామ్నాయం లేదని బ్యూటీకేర్ నిపుణులు చెబుతున్నారు. 

Also read: Cracked Heels: పాదాల్లో పగుళ్ల సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. అయితే మీ కోసమే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News