Belly Fat Study: ఆధునిక జీవనశైలి, బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు పెట్టడం, పని ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో స్థూలకాయం లేదా బెల్లీఫ్యాట్ అనేది ప్రధాన సమస్యలుగా మారిపోయాయి. బెల్లీఫ్యాట్ అనేది మీ ఫిజికల్ లుక్‌ను పాడు చేస్తుంది. అందరిలో ఇబ్బందిగా పరిగణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బెల్లీఫ్యాట్‌పై జరిపిన అధ్యయనాల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా 5 రకాల అంశాల్ని ఇందుకు కారణంగా గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రధానంగా కన్పించే సమస్య బెల్లీ ఫ్యాట్. పొట్ట చుట్టూ పెరుగుతున్న కొవ్వుతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెల్లీ ఫ్యాట్ అనేది మీ ఫిట్నెస్‌ను, మీ లుక్‌ను పాడు చేస్తుంది. జీన్స్ వంటి మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ నుంచి విముక్తి పొందడం అంత సులభమేం కాదు. మీరు కూడా బెల్లీఫ్యాట్‌తో బాధపడుతుంటే..ఇక నుంచి ఏ సమస్యా ఉండదు. ఎందుకంటే..బెల్లీఫ్యాట్‌కు కారణమయ్యే ఐదు ముఖ్యమైన కారణాలేంటో తెలిసిపోయింది. 


బెల్లీ ఫ్యాట్ కారణాలు


శరీరంలో తగిన మోతాదులో ప్రోటీన్లు ఉండాలి. ఎందుకంటే ఇవి ఆకలిని తగ్గించడం, ఎక్కువ తినకుండా నియంత్రించడంలో దోహదపడతాయి. 30 శాతం కేలరీల ప్రోటీన్ సేవనం..బరువు తగ్గించేందుకు మంచిది. అంతేకాదు..మీ శరీరం మెటబోలిక్ రేట్ పెంచుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. దీనికోసం బ్రేక్‌ఫాస్ట్‌లో స్ప్రౌట్స్ సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రోటీన్లు తక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. 


లివర్ పనితీరు


శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైంది. లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే చాలా రకాల రోగాలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా..బెల్లీ ఫ్యాట్‌కు దారి తీస్తుంది. అందుకో వారంలో ఒకసారి లివర్‌ను డీటాక్స్ చేయడం చాలా అవసరం. లేకపోతే బెల్లీఫ్యాట్ సమస్య ఎదురౌతుంది. 


సరైన నిద్ర


నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. ప్రతి రోజూ కనీసం 7-8 గంటలు ఆటంకం లేకుండా నిద్ర ఉండాలి. అలా కాకుండా నిద్ర సరిపోకపోతే..బెల్లీ ఫ్యాట్ సమస్య పొంచి ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టకపోతే..క్యామోమైల్ టీలో కొద్దిగా దాల్చినచెక్క పౌడర్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. రాత్రి నిద్రపోయేముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే బెల్లీఫ్యాట్‌కు దారితీస్తుంది. 


అందుకే తినే ఆహారపు అలవాట్లు, నిద్ర వేళలు, ఒత్తిడిని జయించడం వంటివి అలవాటు చేసుకుంటే కచ్చితంగా బెల్లీఫ్యాట్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


Also read: Cracked Heels: తరచుగా పాదాల్లో ఈ సమస్యలు వస్తున్నాయా.. అయితే వీటి వల్లే జాగ్రత్త..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook