Belly Fat Recipes: ప్రస్తుతం యువతలో బెల్లీ ఫ్యాట్ అనేది పెద్ద సమస్యగా మారింది. పొట్టి పొట్టి బట్టలు ధరించినప్పుడు బెల్లీ ఫ్యాట్ బయటకు రావడం వల్ల కొంతమందిలో ఇది ఇబ్బందికరంగా మారింది నిజానికి బెల్లీ ఫ్యాట్ పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం శరీరంలో విచ్చలవిడిగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు నిజానికి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వ్యాయామాలు ఎంత ముఖ్యమో డైట్ కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వ్యాయామాలు చేసేవారు తప్పకుండా ఉదయం అల్పాహారంలో భాగంగా ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఆహార పదార్థాల్లో ఉండే ఫైబర్ శరీరానికి బోలెడు లాభాలను చేకూర్చుతుంది దీనికి కారణంగా పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి చాలామంది బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డైట్ లో భాగంగా వివిధ రకాల ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల తినలేక పోతుంటారు. అయితే ఇలాంటి వారి కోసం తక్కువ ఖర్చుతో బెల్లీ ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలో.. డైట్ లో ఏ రెసిపీ చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకోండి.


బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి అద్భుతమైన రెసిపీల్లో మొక్కజొన్నసు ఒకటి.. అల్పాహారానికి బదులుగా మొక్కజొన్న సూప్ ను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ను సులభంగా కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇందులో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది సులభంగా బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో సులభంగా చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుందని వారంటున్నారు. అయితే ఈ రెసిపీని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. 


మొక్కజొన్న సూప్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు:
1 కప్పు మొక్కజొన్న
4 కప్పుల నీరు
1 ఉల్లిపాయ (ముక్కలు చేసి)
2 వెల్లుల్లి రేబులు
1 అంగుళం తీగవర్తకుడు
1/2 టీస్పూన్ కొత్తిమీర పొడి
1/4 టీస్పూన్ కారం పొడి
ఉప్పు రుచికి అవసరమైనంత
కొద్దిగా నూనె
కొత్తిమీర ఆకులు (రుచికి కావాల్సినంత)


తయారీ విధానం:
మొక్కజొన్నను నానబెట్టడం: ఈ సూప్ ను తయారు చేయడానికి ముందుగా మొక్కజొన్నను 2-3 గంటలు నీటిలో నానబెట్టండి.
ఉల్లిపాయ, వెల్లుల్లిని వేయించడం: ఒక పాత్రలో నూనె లేదా బట్టర్ వేసి వేడి చేసి, ముక్కలు చేసిన ఉల్లిపాయ, వెల్లుల్లిని వేగించండి.
మసాలా దినుసులు వేయడం: వేగించిన ఉల్లిపాయ, వెల్లుల్లిలో,
 కొత్తిమీర పొడి, కారం పొడి వేసి కొద్దిగా బాగా వేయించుకోవలసి ఉంటుంది.
మొక్కజొన్న, నీరు వేయడం: నానబెట్టిన మొక్కజొన్న, 4 కప్పుల నీరు వేసి బాగా మిక్స్ చేసుకోవలసి ఉంటుంది.
మరిగించడం: ఈ మిశ్రమాన్ని మూత పెట్టి మంట మీద మరిగించండి. మొక్కజొన్న మృదువుగా అయ్యే వరకు అలాగే హై ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవలసి ఉంటుంది. 
మెత్తగా మిక్సీ చేయడం: ఇలా మరిగించుకున్న సూప్ ను మొక్కజొన్న గింజలతో పాటు మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా మిక్సీ చేయండి.
సర్వ్ చేయడం: ఇలా మిక్సీ పట్టుకున్న సూప్‌ను ఒక బౌల్‌లో తీసి, కొత్తిమీర ఆకులు వేసి సర్వ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న సూపును రోజు ఉదయాన్నే తాగడం కేవలం 15 రోజుల్లో వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.