Beauty Benefits Of Apricot: వేసవి కాలం ప్రారంభంలో ఆప్రికాట్ పండ్లు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మ, జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఆప్రికాట్ పండ్లలో బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తీవ్ర చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్‌ A, B, C,  E కూడా లభిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆప్రికాట్ పండ్లలో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడవం వల్ల సులభంగా శరీర బరువు, కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా శరీర బలహానత సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. 


ఆప్రికాట్ పండ్లు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్: 
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది:

ఈ పండ్లలో ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా చర్మాన్ని హైడ్రేట్‌ చేసేందుకు సహాయపడుతాయి. ఆప్రికాట్ పండ్లలో విటమిన్ ఎ కూడా లభిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా తయారు చేస్తుంది. 


Also Read: Surya Gochar 2023: సూర్య సంచారం 2023.. కన్యా రాశి వారికి అదృష్టం! కోరుకున్న ఉద్యోగం మీ సొంతం


బ్లాక్ హెడ్స్ సమస్యలకు చెక్‌:
ఆప్రికాట్ పండ్లలో ఉండే సహజమైన యాసిడ్స్‌ మొటిమలను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తీవ్ర చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆప్రికాట్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.


జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:
ప్రస్తుతం మార్కెట్లలో ఆప్రికాట్ పండ్లతో తయారు చేసిన నూనెను లభిస్తుంది. దీనిని జుట్టుకు వినియోగించడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 


యాంటీ ఏజింగ్:
ఆప్రికాట్ చర్మానికి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని అల్పాహారంలో తీసుకోవడం వల్ల ముఖంపై గ్లో పెరుగుతుంది. 


Also Read: Surya Gochar 2023: సూర్య సంచారం 2023.. కన్యా రాశి వారికి అదృష్టం! కోరుకున్న ఉద్యోగం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook