Virgo zodiac sign peoples will get Lucky in every work due to Surya Gochar 2023: జ్యోతిష్యశాస్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. ఈ మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చుసుపుతుంది. కొన్ని రాశుల వారికి శుభాలు ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అశుభాలు ఉంటాయి. ఈ నెలలోనే సూర్యుడు తన రాశిని మార్చుకోనున్నాడు. మే 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సూర్యభగవానుడి మార్పు కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని మార్పు ఈ రాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
కన్యా రాశి వారికి ఉద్యోగం సంబంధిత విషయాలలో అదృష్టం ఉంటుంది. ఈ రాశి వారు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. టూర్‌కు సంబంధించిన ఉద్యోగం ఉన్న వ్యక్తులు.. చాలా ప్రదేశాలకు (ఉద్యోగానికి సంబంధించి) వెళ్లవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఉద్యోగాలలో ప్రమోషన్ పొందవచ్చు. మీ పొజిషన్ మారే అవకాశం కూడా ఉంది.
కన్యా రాశి వారికి విదేశీ సంబంధిత వ్యాపారంకు ఇది సరైన సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెడితే.. దాని ఫలితం ఇప్పట్లో కనిపించక పోయినా రానున్న రోజుల్లో మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. పూర్వీకుల వ్యాపారంలో అన్నయ్య, తండ్రి సలహాలు పాటించాలి. వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ సమయంలో అధిక లాభాలు పొందనున్నారు. వ్యాపారంకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
కన్యా రాశి యువత వారి సాన్నిహిత్యంపై ఆలోచించాలి. కొందరు చేదు స్నేహితులు మీ పక్కనే తిరుగుతారు. మీతోనే ఉంటూ మీ ఇమేజ్‌కి భంగం కలిగిస్తారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబంతో కలిసి మతపరమైన ప్రయాణం చేయవచ్చు. కుటుంబ విషయాలను అనవసరంగా బయటికి లాగకూడదు. ఆలా చేస్తే సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి.
కన్యా రాశి వారు దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా జబ్బుతో బాధపడుతూ రెగ్యులర్‌గా మందులు వేసుకునే వారు ఒకసారి డాక్టర్‌తో రొటీన్ చెకప్ చేయించుకోండి. మలబద్ధకం వంటి సమస్యలను తీవ్రంగా పరిగణించాలి. ఈ సమస్య చాలా రోజులుగా కొనసాగుతూ ఉంటే.. వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Janhvi Kapoor Telugu Films: మరో రెండు తెలుగు సినిమాలలో జాన్వీ కపూర్.. ఫ్లాఫ్ హీరోకు జతగా!
Aslo Read: Samantha-MS Dhoni: అయ్యా బాబోయ్.. ఎంఎస్ ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడో: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.