Benefits Of Coconut Water: కొబ్బరి నీరు అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఆరోగ్య నిధి. ఇందులో ఉండే నీరు తాగడం వల్ల అనేకరమైన ఆరోగ్య సమస్యలు మాయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలోనే కొబ్బరి నీరును తాగుటుంటారు. కానీ దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఎన్నో పోషకాలను దాచుకుంది.  దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మీరు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్‌ సి, బి అధికంగా లభిస్తాయి. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో కొబ్బరి నీళ్ల తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్‌, మలబద్దకం, అసిడిటి వంటి సులువుగా తగ్గుతాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత్తలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. డిహైడ్రేషన్‌ తో బాధపడేవారు కొబ్బరినీరును తీసుకోవడం చాలా మంచిది.


గుండె సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రించడంలో మేలు చేస్తుంది. కొబ్బరి నీరు మూత్రపిండాలను శుభ్రం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది బ్యాక్టిరీయాను తొలగించడంలో సహాయపడుతుంది. అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. కొబ్బరి నీరు కేవలం శరీరానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే సహజమైన గుణాలు మొటిమలను, మచ్చలను తొలగించడంలో మేలు చేస్తాయి. కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల ఎలాంటి అంటూవ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఎప్పుడు తాగాలి?


కొబ్బరినీరును అనేక విధాలుగా తాగవచ్చు. కొంతమంది కొబ్బరి నీళ్లలో పండ్లు, పాలు కలుపుకొని తాగుతారు. కొబ్బరినీటిని ఎక్కువగా ఉదయం పరగడుపున తీసుకోవడం చాలా మంచిది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుచేయడంలో ఎంతో సహాయపడుతుంది. లేదా వ్యాయామం చేసిన తర్వాత శరీరంలో నీరు కోల్పోతుంది. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి నీరు అందుతుంది.


సాధారణంగా, ఆరోగ్యవంతమైన వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. కానీ, కొన్ని సందర్భాల్లో కొబ్బరి నీళ్లు కొన్ని అలర్జీలను కలిగించవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగకూడదు?


కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనది అయినప్పటికి కొంతమంది దీని తీసుకోకుండా ఉండాలి. అందులో మొదట డయాబెటిస్‌ ఉన్నవారు దీని తీసుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అలర్జీలు ఉన్నవారు కూడా దీని తీసుకొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 


Also read: Garlic And Onion: వెల్లుల్లి లేదా ఉల్లిపాయ రెండిటిలో ఏది ఉత్తమం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter