Garlic Benefits: వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైన త్వరగా నయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లులి నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ వెల్లుల్లితో తయారు చేసే జ్యూస్ ను పరగడుపున తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు అదుపులో: 


వెల్లుల్లి జ్యూస్‌ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరంలో కేలరీలను బర్న్‌ చేయడంలో ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆకలి నియంత్రిచడంలో వెల్లుల్లి మేలు చేస్తుంది. 


చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో: 


చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో ఈ వెల్లుల్లి రసం తీసుకోవడం కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


వ్యర్థాల తొలగిడంలో: 


వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలుగుతాయి. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి.పరగడుపున వెల్లుల్లి జ్యూస్‌ తీసుకోవడం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి. 


చర్మ సంరక్షణలో: 


చర్మ కాంతిని పెంచడంలో వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్‌ తీసుకోవడం వల్ల శరీరానికి, చర్మానికి ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌  లక్షణాలు ఉంటాయి. 


సీజనల్ వ్యాధులు:


సీజనల్‌ వచ్చే ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులకు వెల్లుల్లి జ్యూస్‌ ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది. 


Also Read: Smartphone Users: భారతీయులు తమ ఫోన్‌లను రోజుకు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారో తెలుసా? షాకింగ్ రిపోర్ట్..
జీర్ణక్రియ: 


జర్ణీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి చేయడంలో వెల్లుల్లి ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook