Anjeer Juice: అంజీర్ పండులో ఉండే పోషకాల గురించి మీకు తెలుసా..?
Anjeer Juice Benefits: అంజీర్ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంజీర్‌ని ఎక్కువగా డ్రై ప్రూట్స్ రూపంలో మార్కెట్లో లభిస్తాయి. అయితే అంజీర్ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు దీని లాభాల గురించి మనం తెలుసుకుందాం..
Anjeer Juice Benefits: అంజీర్ పండు బయట మెత్తగా, లోపల చిన్న గింజలతో ఉంటుంది. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఐరన్, సి, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ పోషకాలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఈ పండును జ్యూస్ చేసి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఎలా జ్యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ జ్యూస్ తయారు చేసే విధానం..
దీని కోసం ముందుగా మూడు అంజీర్ పండ్లను జార్‌లోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల చెక్కరను, అర గ్లాస్ పాలు, అర గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టుకుని గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇలా ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. అంజీర్ జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
❈ అంజీర్ జ్యూస్ తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడ్డవచ్చు.
❈ అంజీర్ పండు లేద జ్యూస్ వల్ల ఐరన్ లెవల్స్ పెరుగుతాయి.
❈ రక్తహీనత శక్తితో బాధపడుతున్నవారు రోజు అంజీర్ పండు తీసుకోవడం వల్ల ఐరన్ లెవల్స్ పెంచుతాయి.
Also read: Wifi Speed Tips: ఇంటర్నెట్ వైఫై స్పీడ్ తగ్గిపోతోందా, ఈ ట్రిక్స్ అప్లై చేస్తే చాలు
❈ అంజీర్ జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది.
❈ అంజీర్ జ్యూస్ వల్ల గొంతునొప్పిని తగ్గించడంలో, మొలల సమస్య ఉపశమనం కలుగుతుంది.
❈ షుగర్ లెవల్స్ సరిగా ఉంచడంలో సహాయపడుతుంది అంజీర్ పండు, జ్యూస్
ఈ విధంగా అంజీరా పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగలు ఉంటాయి. అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also read: Corn Silk Uses: కిడ్నీలో రాళ్లకు మొక్కజొన్న పీచుతో 15 రోజులో చెక్ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి