COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Routine After Morning Walk: శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మార్నింగ్‌ వాక్‌ కూడా చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నడవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా అనే లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతొ బాధపడేవారు కూడా ప్రతి రోజు మార్నింగ్‌ వాక్‌ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.


అంతేకాకుండా ఉదయం పూట నడవడం వల్ల ఒత్తిడితో పాటు దీర్ఘకాలిక వ్యాధుల కూడా సులభంగా దూరమవుతాయి. అయితే ప్రతి మార్నింగ్‌ వాక్ చేసేవారు తప్పకుండా ఈ కింది నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మరిన్ని లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మార్నింగ్‌ వాక్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇదే క్రమంలో అతిగా ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం మంచిదేనా ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


మార్నింగ్‌ వాక్ నుంచి వచ్చిన తర్వాత ఈ పనులు చేయండి:
ఎక్కువగా నీటిని తాగండి:

మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 15 నిమిషాల పాటు రెస్ట్‌ తీసుకుని గంట పాటు నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే వాకింగ్‌ చేసే క్రమంలో శరీరం బాగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత కేవలం నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల నీటిలో ఉండే ఎలక్ట్రోలైట్‌లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. 


ఫ్యాన్‌ కింద కూర్చోవాల్సి ఉంటుంది:
చాలా మందిలో మార్నింగ్‌ వాక్‌ చేయడం వల్ల శరీరం వేడిగా తయారవుతుంది. దీని కారణంగా అనేక చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఉదయాన్నే వాకింగ్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత AC లేదా ఫ్యాన్‌ కింద కూర్చొని రెస్ట్‌ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి