Tulsi Benefits: మెరిసిపోయే చర్మం కోసం తులసి ఆకులతో ఫేస్ ప్యాక్.. ఇలా చేసుకోండి
How to Prepare Tulsi Face Pack: మీరు మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? మీ చర్మంలో మెరుపు కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
How to Prepare Tulsi Face Pack: తులసి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని కషాయాన్ని తయారు చేసి తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తులసి చర్మాన్ని కూడా నయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని మొటిమల నుంచి రక్షిస్తాయి. తులసి ఆకులతో ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది. తులసిలో అనేక వస్తువులను మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌లను తయారుచేసే విధానాన్ని తెలుసుకోండి.
తులసి, తేనె మిక్స్ చేసి..
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా తులసి ఆకులను మెత్తగా రుబ్బుకుని ఓ పేస్ట్‌గా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొన్ని చుక్కల తేనె వేసి కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయండి. కనీసం 20 నిమిషాల పాటు ముఖం మీద ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో ముఖంలో మెరుపు వస్తుంది.
తులసి, అలోవెరా ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీరు ముందుగా తులసి ఆకులను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై దానికి కొద్దిగా తాజా కలబంద గుజ్జును కలపాలి. దీన్ని బాగా కలపండి. కనీసం 15 నిమిషాలపాటు ముఖం మీద ఉంచుకోండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయండి. కొన్ని రోజుల తర్వాత మీరు ముఖంలో మెరుపును చూడవచ్చు.
తులసి, శనగపిండి కలిపి..
తులసి, శనగపిండి చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. మీరు తులసిని మెత్తగా రుబ్బి అందులో శనగపిండి వేయండి. ఆ తర్వాత దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను కాసేపు అప్లై చేసి ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. మొటిమల సమస్య ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ దివ్యౌషధంగా పని చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Dallas Airshow: డల్లాస్ ఎయిర్ షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో వైరల్
Also Read: Pak Vs Eng Final: పాకిస్థాన్-ఇంగ్లండ్ ఫైనల్ పోరు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ అమ్మాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook