Janaki Easwar: T20 ప్రపంచ కప్ 2022 చివరి దశకు చేరుకుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల ఫైనల్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. కోట్లాది మంది భారత అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేస్తూ.. టీమిండియా సెమీ ఫైనల్లో వెనుతిరిగింది. అయితే భారత జట్టును మెల్‌బోర్న్‌లో చూడలేకపోయినా.. మన దేశానికి చెందిన జాంకీ ఈశ్వర్ అనే 13 ఏళ్ల అమ్మాయి తన గాత్రం వినిపించనుంది.
ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మకమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా టీ20 ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్ పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు మన దేశానికి చెందిన గాయని జానకీ ఈశ్వర్ తన గాత్రంతో కోట్లాది మంది ఇండియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేయనుంది.
జానకీ వయస్సు కేవలం 13 సంవత్సరాలు. ఆమె కేరళ రాష్ట్రానికి చెందినది. ఆమె 2007 సంవత్సరంలో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ రాక్ గ్రూప్ ఐస్ హౌస్‌తో జాంకీ ఈశ్వర్ ప్రదర్శన ఇవ్వనుంది.
T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రదర్శన ఇవ్వడం పట్ల జానకీ సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి అవకాశాలు లభిస్తే తనలో మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలిపింది.
భారత్ ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఉండే బాగుండేదని జానకీ తన మనసులోని కోరికను బయటపెట్టింది. తన తల్లిదండ్రుల వల్లనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది.