Korean Face Mask: కొరియన్ అమ్మాయిలు సహజంగానే అందంగా ఉంటారు. ముఖ వర్ఛస్సు మిళమిళలాడుతుంటుంది. అద్దంలా మెరుస్తుంటారంటారు. మీక్కూడా అలానే మారాలనుంటే పెద్ద కష్టమైన పనేం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొరియన్ ఫేస్ మాస్క్ వాడితే చాలంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది అందం కోసం ఎక్కువగా హోమ్ రెమిడీస్ పాటిస్తుంటారు. ఎందుకంటే మార్కెట్‌లో లభించేవాటి వల్ల దుష్పరిణామాలు ఎక్కువ. ముఖానికి నిగారింపు కోసం చిట్కాలు అనుసరిస్తుంటారు. ఇందులో అద్భుతమైంది కొరియన్ ఫేస్ మాస్క్. కొరియన్ పేస్ మాస్క్‌ను బ్యూటీ రెమిడీగా విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే కొరియన్ మహిళల ముఖం తాజాగా, నిగనిగలాడుతూ ఎప్పటికీ యౌవనంగా ఉంటుంది. చర్మంపై సహజ కాంతి ఉంటుంది. ఇంతకీ కొరియన్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి, ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..


కొరియన్ ఫేస్ మాస్క్ తయారీ కూడా చాలా సులభం. బియ్యం పిండి, తేనెతో తయారు చేస్తారు. బియ్యం అనేది ఆరోగ్యానికే కాకుండా చిట్కాల్లో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మానికి నిగారింపు అందిస్తుంది. మచ్చలు, మరకలుంటే తొలగిపోతాయి. ముఖంపై పింపుల్స్ సమస్య ఉత్పన్నం కాదు. 


కొరియన్ ఫేస్ మాస్క్ తయారీ విధానం


ముందుగా ఒక గిన్నెను స్టౌవ్ పై స్లో ఫ్లేమ్‌పై ఉంచి అందులో గ్లాసు నీళ్లు పోయాలి. అందులో ఒక స్పూన్ బియ్యం పిండి కలపాలి. క్రీములా మారిన తరువాత అందులో 1 స్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. పూర్తిగా మిశ్రమంగా మారాక ముఖానికి రాసుోకవాలి. దాదాపు 15 నిమిషాలుంచి అప్పుడు ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. 


బియ్యం పిండి అనేది ముఖంపై ఉండే అదనపు ఆయిల్‌ను పీల్చుకుంటుంది. తేనె చర్మానికి అవసరమైన మృదుత్వాన్ని కలగజేస్తుంది. పిగ్మంటేషన్ దూరం చేస్తుంది. చర్మ సంబంధిత ఎలర్జీని తగ్గిస్తుంది. పింపుల్స్ తగ్గించడమ కాకుండా ఇంకా చాలా సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. తేనె అనేది సహజసిద్ధమైన ఎక్స్ ఫోలియేట్‌గా పనిచేస్తుంది. 


Also read: NEET PG 2024: నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలో మార్పు, తిరిగి నిర్వహించేది ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook