Skin Whitening Drinks: ఎలాగో ఎలాంటి కాలమైనా మనకు ఎండలు ఉంటున్నాయి.. కాబట్టి శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా.. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తాగుతూనే ఉండాలి. మన శరీరంలో హైడ్రేషన్ తగ్గిపోతే చర్మం కూడా పొడి బారి పోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి రోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు.. తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారి మంచినీళ్ళే తాగాలంటే బోర్ కొడుతుంది. కాబట్టి ఇంట్లోనే చేసుకునే ఈ ఈజీ డ్రింక్స్ ట్రై చేయండి. వీటి వల్ల శరీరం హైడ్రేట్ అవ్వడం మాత్రమే కాకుండా చర్మం కూడా అందంగా, మృదువుగా మారుతుంది. శరీరం మెరవడం కోసం ఈ డ్రింక్స్ తాగండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ: 


గ్రీన్ టీ లో ఉండే కాటెచిన్స్ ఫ్రీ రాడికల్స్‌తో.. పోరాడుతాయి. అంతే కాకుండా శరీరాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తాయి. ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో టీస్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి
రెండు నిమిషాలు ఉంచండి. తర్వాత
ఆకులను వడకట్టి, ఒక చెంచా తేనె కలపండి. అంతే టేస్టీ గ్రీన్ టీ రెడీ. 


నిమ్మకాయ నీళ్లు:


నిమ్మకాయ నీళ్లలో తేనె కలిపి.. తాగితే అందులో ఉండే మాయిశ్చరైజర్లు.. మన శరీరంలో ఉన్న కొల్లాజెన్‌ లెవెల్ ను పెంచుతాయి. స్కిన్ టోన్ కూడా ఈవెన్ గా మారి మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మ వ్యాధులకు కారణమయ్యే శిలీంధ్రాల పెరుగుదలను.. కూడా అడ్డుకునే శక్తి నిమ్మ రసానికి ఉంటుంది. ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్-సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. టేస్టీగా ఉండే ఈ డ్రింక్.. చేయడం కూడా ఈజీనే. ఒక చిన్న కప్పు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ తేనె కూడా వేసి కలుపుకుంటే సరి.


అల్లం పసుపు నీరు:


పసుపు లో ఉండే కుర్కుమిన్, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మొహంలో చైతన్యం నింపుతాయి. ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో తురిమిన అల్లం, కొంచెం పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి కొంచెం తేనె కూడా కలుపుకొని తాగవచ్చు. 


అలోవెరా జ్యూస్:


అలోవెరా లో ఉండే విటమిన్లు, ఎంజైమ్స్ హైడ్రేట్స్ శరీరంలో ఉండే కొల్లాజెన్‌ను పెంచి ఎరుపును, వాపులను తగ్గిస్తాయి. నెమ్మదిగా కలబంద పైన ఉండే పొరను కత్తితో తీసేయాలి. కలబంద లోపల జెల్ ను.. తొలగించి నీటితో బాగా కడిగి బ్లెండర్ లో.. వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. అందులోని కొంచెం నిమ్మరసం కలిపితే మంచి సువాసన కూడా వస్తుంది. అయినా టేస్ట్ నచ్చకపోతే కొంచెం తేనె కూడా వేసుకొని తాగవచ్చు.


సబ్జా వాటర్:


సబ్జా గింజలలో ఉండే ఒమేగా-3 వృద్ధాప్యంతో పోరాడుతుంది. దానివల్ల ముడతలు పోయి అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ చియా గింజలను రాత్రి మొత్తం.. నానబెట్టాలి. కుదరకపోతే కనీసం 30 నిమిషాలైనా నీళ్లలోనే నాననివ్వాలి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల సబ్జా గింజల నీళ్లతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.


కొబ్బరి నీళ్ళు:


కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సైటోకినిన్స్ హైడ్రేట్స్ కూడా ముఖం మీద ముడతలు రాకుండా కాపడతాయి. అసలే వేసవికాలం కాబట్టి ఎక్కడ.. కావాలంటే అక్కడ కొబ్బరి నీళ్లు పుష్కలంగా దొరుకుతాయి. ఈసారి బయటకు వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం మర్చిపోవద్దు.


క్యారెట్ - బీట్‌ రూట్ జ్యూస్:


క్యారెట్ లో ఉండే బీటా-కెరోటిన్, బీట్ రూట్ లో ఉండే విటమిన్స్ డల్ గా ఉన్న చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తాయి. ఒక చిన్న బీట్‌ రూట్ ముక్క, రెండు క్యారెట్ లను కడిగి బ్లెండర్ లో వేసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.


దోసకాయ - పాలకూర రసం:


దోసకాయలో పుష్కలంగా దొరికే హైడ్రేషన్ ఏజెంట్లు, బచ్చలి కూరలో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ముందుగా దోసకాయని పీల్ చేసి చిన్న ముక్కలుగా.. కట్ చేసుకోవాలి. కొన్ని పాలకూర ఆకులను కడిగి బ్లెండర్లో వేసుకోవాలి. దోసకాయ ముక్కలను కూడా అందులో వేసి తగిన నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దానికి కొంచెం తేనె కూడా కలిపి తాగితే రుచిగా కూడా ఉంటుంది.


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి