Dandruff Problem: శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల జుట్టు సంబంధిత  సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డేండ్రఫ్ సమస్య అటువంటిదే. ఏ లోపంతో డేండ్రఫ్ సమస్య వెంటాడుతుందో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలిలో జుట్టు సంబంధిత సమస్యలు చాలా ఉంటున్నాయి. హెయిర్ ఫాల్, పల్చని జుట్టు, నిర్జీవమైన జుట్టుతో పాటు డేండ్రఫ్ ప్రధాన సమస్యగా కన్పిస్తోంది. హెయిర్ కేర్ సరిగ్గా లేకపోవడం,  చలికాలంలో డేండ్రఫ్ సమస్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని పోషకాల లోపం వల్ల కూడా డేండ్రఫ్ సమస్య ఉంటుంది. ఈ నేపధ్యంలో ఏ విటమిన్ లోపంతో జుట్టులో డేండ్రఫ్ వస్తుందో తెలుసుకుందాం..


విటమిన్ బి 3నే నియాసిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే..డేండ్రఫ్ సమస్య తలెత్తుతుంది. అందుకే విటమిన్ బి3 ఆరోగ్యం కోసమే కాకుండా జుట్టు, స్కాల్ప్ కోసం కూడా మంచిది. మీకు ఒకవేళ డేండ్రఫ్ సమస్య వెంటాడుతుంటే..వెంటనే మీ డైట్‌లో రెడ్ మీట్, చికెన్, చేపలు, బ్రౌన్ రైస్, ధాన్యం విత్తనాలు, ఆరటిపండ్లు చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ బి3 పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ల లోపం ఏర్పడితే ఈ ఆహార పదార్ధాల ద్వారా సరిచేసుకోవచ్చు. 


ఇక మరో కారణం విటమిన్ బి2 లోపం. మీ శరీరంలో విటమిన్ బి2 లోపం అంటే రెబోఫ్లెవిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యం, చర్మం, జుట్టుకై చాలా మంచిది. డైరీ మిల్క్, పెరుగు, పన్నీర్, గుడ్లు, నాన్‌వెజ్, సాల్మన్ ఫిష్‌లలో విటమిన్ బి2 పుష్కలంగా లభిస్తుంది. డేండ్రఫ్ ఎక్కువగా వేధిస్తుంటే ఈ పదార్ధాల్ని తక్షణం డైట్‌లో చేర్చుకోండి.


జింక్ అనేది సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. జింక్ అనేది ఆరోగ్యం, జుట్టుకు చాలా అవసరమైన మినరల్. జింక్ లోపంతో చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మాంసం, పప్పులు, విత్తనాలు, నట్స్, డార్క్ చాకొలేట్‌లలో జింక్ పుష్కలంగా ఉంటుంది.


Also read: Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆ పండ్లు తింటే చాలు, నో బ్లడ్ షుగర్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook