Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆ పండ్లు తింటే చాలు, నో బ్లడ్ షుగర్

Diabetes: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో పోషక గుణాలున్నాయి. కొన్ని పండ్లైతే మధుమేహానికి విరుగుడు కల్గిస్తాయి. అందులో ఒకటి జామకాయ. బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించే పండ్లు ఇంకా ఏమున్నాయనేది ఓసారి పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2022, 04:38 PM IST
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆ పండ్లు తింటే చాలు, నో బ్లడ్ షుగర్

Diabetes: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో పోషక గుణాలున్నాయి. కొన్ని పండ్లైతే మధుమేహానికి విరుగుడు కల్గిస్తాయి. అందులో ఒకటి జామకాయ. బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించే పండ్లు ఇంకా ఏమున్నాయనేది ఓసారి పరిశీలిద్దాం..

జాంకాయలు మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. విటమిన్ ఎ, సి, పొటాషియం వంటి పోషక గుణాలు జామకాయల్లో పుష్కలంగా ఉంటాయి. జాంకాయల్లో గ్లైకోమిక్ ఇండెక్షన్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. జామకాయతో పాటు నేరేడు పండ్లు కూడా మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచివి. నేరేడు పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల..రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. మీరు డయాబెటిక్ అయితే..ఇవాళే మీ డైట్‌లో చేర్చుకోండి. 

ఇక యాపిల్ కూడా డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరం. ఇందులో సాల్యుబుల్, అన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. ఇక కివి ఫ్రూట్ అద్భుత పోషక గుణాలు కలిగి ఉంటుంది. కివీ తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం. కివీలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. ఇక మరో ఫ్రూట్ ఆరెంజ్ డయాబెటిస్ రోగులకు ఆరెంజ్ కూడా మంచిది. ఇందులో పుష్కలంగా ఫైబర్, విటమిన్ సి, ఫాలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి డయాబెటిస్ రోగులకు ఉపశమనం కల్గిస్తుంది. 

Also read: Mango Leaves Benefits: మామిడి ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News