Prediabetes: ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు జీవనశైలిలో పాటించాల్సిన అలవాట్లు..!
Prediabetes Lifestyle Tips: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Prediabetes Lifestyle Tips: ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ఈ వ్యాధితో బాధపడేవారు జీవనశైలి పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండాలి.
అయితే డయాబెటిస్ వచ్చే ముందు ప్రీ-డయాబెటిస్ మొదలైవుతుంది. ఇది శరీరంలోని షుగర్ లెవల్స్ పెంచుతుంది. దీని డయాబెటిస్ అంటారు. ప్రీ-డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు సకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ టైమ్‌కు చికిత్స తీసుకోకుండా ఉంటే టైప్-2 డయాబెటిస్ బారిన పడాల్సి ఉంటుంది.
కాబట్టి వ్యాధిని ముందుగానే గుర్తించండి. దీని కోసం మీరు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. ముందుగా ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటిన్, మంచి కొవు ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
బయట తయారు చేసే ప్రాసెస్, కూల్ డ్రింక్స్, అధిక షుగర్‌లో తయారు చేసే పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటివల్ల షుగర్ లెవల్స్ ఇతర అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అధిక బరువు కారణంగా కూడా అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి బారిన పడకుండా ఉండాల్సి ఉంటుంది. ఒత్తిడి కారంగా ఆరోగ్యంగా పట్ల చెడు ప్రభావం కాలిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రీ-డయాబెటిస్‌తో బాధపడేవారు బ్లడ్ షుగర్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే వైద్యుడి సూచించిన పరీక్షలు, మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆహారం, జీవనశైలి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాాలా అవసరం. ప్రతినెల వైద్యపరీక్షలు చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీరు ఎలాంటి డైట్ పాటించాలి అనేది తెలుసుకోవచ్చు. అతిగా కాకుండా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సరైన టైమ్‌లో మందులను తీసుకోవడం చాలా మంచిది. పైన చెప్పిన వాటిని పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ తెలిపిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఆరోగ్య నిపుణులను సంప్రదించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి