Tips For Healthy Travelling: ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే అదో గతే!
Tips For Staying Healthy While Travelling: మనలో చాలా మందికి ట్రిప్‌లకు వెళ్లడం అంటే ఎంతో నూతనోత్సహం కలుగుతుంది. అయితే చాలా మంది ట్రిప్‌లకు వెళ్లతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tips For Staying Healthy While Travelling: కొత్త ప్రదేశాలను చూడాలి అనుకొనేవారు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తినడం, వాతవరణం మార్పులు ఇతర కారణాల వల్ల మనం కొన్ని సార్లు అనారోగ్యాల సమస్యల బారిన పడుతుంటాము. అయితే ఈ సారి మీరు ట్రిప్‌కు ప్లాన్ చేసినప్పుడు ఈ జాగ్రతాలను పాటించండి.
ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు:
గమ్యస్థానం ఎంచుకోండి:
మొదటగా మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకోండి.
ఆన్‌లైన్‌లో పరిశీలించండి:
మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించండి
Also Read: Search By Date Feature: వాట్సాప్ 'సెర్చ్ బై డేట్' ఫీచర్‌తో మీ పని సులభంగా అవుతుంది!
ఆహారం:
ప్యాక్ చేసిన ఆహారం మీద ఆధారపడకండి:
ఎక్కువగా వేయించిన ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం నివారించండి.
పండ్లు, కూరగాయలు, గింజలు:
వీటిని ఎక్కువగా తీసుకోండి. ఇవి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను సులభం చేస్తాయి.
బాటిల్డ్ వాటర్:
బయట తాగే నీటిపై నమ్మకం లేకపోతే, సురక్షితమైన బాటిల్డ్ వాటర్‌ని తీసుకువెళ్లండి.
మీ బడ్జెట్‌ను నిర్ణయించండి:
బుక్ చేసుకోండి:
ఖర్చుల కోసం ముందుగానే బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి.
పరిమాణంలో భోజనం:
ఎక్కువగా తినడం వల్ల అలసట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తినండిని మితంగా తీసుకోండి.
నీరు ఎక్కువగా తాగండి :
ప్రయాణంలో శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి రోజు అంతా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండండి.
సరిపడా నిద్ర:
ప్రయాణంలో నిద్రపోవడం కష్టం అనిపించినా, సాధ్యమైనంత వరకు 8 గంటల నిద్ర తీసుకోవడానికి ప్రయత్నించండి.
క్రమం తప్పకుండా వ్యాయామం:
ప్రయాణంలో కూడా కొన్ని నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
శుభ్రత:
బయట తిరిగిన తర్వాత తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. సానిటైజర్ వాడండి.
మందులు:
మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, అవసరమైన మందులు వెంటనే తీసుకువెళ్లండి.
మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కాలు సహాయపడతాయి. ఎలాంటి ఇబ్బందుల బారిన పడకుండా మీరు మీ ట్రిప్‌ను అనందంగా గడుపుతారు.
ఈ విధంగా మీరు టిప్స్‌ను పాటించడం వల్ల మీ ట్రిప్ ఎంతో హాయిగా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యంగా ఎక్కువగా మహిళలకు, పిల్లలకు ఎంతో ఉపయోగపడుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter