Vastu tips : వంట ఇల్లు అనేది ఒక ఇంటికి ఎంతో ముఖ్యమైనది. రోజు మనం తినే ఆహారం మన వంట ఇంటి నుంచే వస్తుంది. ఇక్కడ పరిశుభ్రత ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండకపోతే దాని పరిణామం నేరుగా మన ఆరోగ్యం మీద పడుతుంది కాబట్టి ఎప్పుడు వంటింటి ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మనం వంట చేసే దానికి అనువుగా ఉండడం కోసం చాలా సందర్భాలలో ఏ వస్తువు ఎక్కడ ఉంచితే కరెక్ట్ గా ఉంటుంది అనేదానికంటే కూడా ఏది ఎక్కడ పెడితే మనకు వీలుగా ఉంటుంది అనేది చూసుకుంటాం. కానీ అలా చేయడం వల్ల అనుకోని కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు శాస్త్రం అనేది కేవలం మనం మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఎందరో నమ్ముతారు కాకపోతే ఆదేశాల్లో వీటి పేర్లు , విధివిధానాలు వేరుగా ఉంటాయి. కానీ శాస్త్రం ఏదైనా అది మన మంచే కదా చెబుతుంది. నీ వంటింట్లో అన్నపూర్ణ తో పాటు లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలి అంటే వంటింట్లో కొన్ని వస్తువులను కొన్ని దిశల్లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎప్పుడు అన్నాన్ని అవహేళన చేయకూడదు. మన ఇంట్లో వంటింటి శుభ్రతపై పెట్టే శ్రద్ధలో కాస్త ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాము అనే విషయంలో కూడా పెట్టుకోవాలి.


ఇంట్లో ఎప్పుడు డబ్బుకి తిండికి కొరత ఉండకూడదు అంటే ముందుగా మన వంటింటి రంగు ఎలా ఉందో చూసుకోవాలి. చాలామంది వంట గదిలో మరకలు పడకూడదు అనే ఉద్దేశంతో వీలైనంత డార్క్ కలర్స్ వేయిస్తారు. కానీ ఇలాంటి రంగులు అస్సలు వేయకూడదు అని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతారు. వంటింట్లో పేస్టెల్ గ్రీన్ ,లెమన్ ఎల్లో లాంటి లైట్ కలర్స్
వేయించుకోవాలి. కత్తి, కత్తెర స్పూన్లు వంటి వస్తువులను గ్యాస్ కి దగ్గరగా పెట్టుకోకూడదు. అవసరమైనప్పుడు వాడుకొని తిరిగి వాటిని ఉంచుకోవాలి.


మీరు వంట కోసం ఉపయోగించే పాత్రలు ఎప్పుడు కూడా వెస్ట్ లేక సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉండే విధంగా కబోర్డ్స్ లో సర్దుకోవాలి. ఎప్పుడు నిత్యం వంటింట్లో వాడే మిక్సీ సౌత్ ఈస్ట్ జోన్ లో ఉంటే ఫ్రిడ్జ్ నార్త్ వెస్ట్ జోన్ లో పెట్టుకోవాలి.
అలాగే వంట చేసేటప్పుడు మాత్రమే అవసరమైన వస్తువులు బయటకి తీసుకొని తర్వాత అన్ని అలమారాల్లో సర్దుకునే విధంగా పెట్టుకోవాలి. వంటింటి బండమీద ఎప్పుడు అన్ని వస్తువులు చెల్లాచెదురుగా పరిచి ఉంచకూడదు.


గమనిక: పైన చెప్పిన విషయాలు కేవలం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వెల్లడించడం జరిగింది. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా పొందడం మంచిది.


Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook