Natural Home Remedies For White Hair: వృద్ధాప్యం లేదా రసాయనాల ఉత్పత్తులను అతిగా వినియోగించడం వల్ల చాలామందిలో నల్ల జుట్టు తెల్లగా మారుతోంది. తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే హెయిర్ డైలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల సాధారణంగా తెల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ ఇది కొంతకాలానికి పరిమితం అవుతోంది. మళ్లీ ఎప్పటి లాగా తెల్ల జుట్టుగా మారిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రసాయనాలతో కూడిన హెయిర్ డైను వినియోగించకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కుదుళ్ళ నుంచి జుట్టు నల్లగా మారడమే కాకుండా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి రెమెడీస్ వినియోగించడం వల్ల తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


తెల్ల జుట్టు కోసం సహజ రంగు:
ముఖ్యంగా ఉసిరికాయతో తయారుచేసిన రంగును జుట్టుకు పట్టించడం వల్ల శాశ్వతంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ సహజ రంగును తయారు చేయడానికి ముందుగా ఏడు నుంచి ఎనిమిది ఉసిరిముక్కలను తీసుకోవాలి. వీటిని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అదే నూనెలో రెండు టీ స్పూన్ల మెంతి గింజలు వేసి మళ్లీ మరిగించాలి.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో


ఇలా ఐదు నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓ చిన్న బాటిల్ లో భద్రపరచుకుంటే అంతే సులభంగా మీ జుట్టుకు సహజరంగునిచ్చే హెయిర్ కలర్ రెడీ అయినట్లే.. దీనిని మీరు స్నానం చేసే నాలుగు గంటల ముందు జుట్టుకు అప్లై చేసి సహజ షాంపుతో తల స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ప్రభావంతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చేస్తుంది.


బ్లాక్ టీ:
తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు బ్లాక్ టీ ఆకులు కూడా ప్రభావంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టునే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి. దీనికోసం రెండు టీ స్పూన్ల ఆకుల మిశ్రమాన్ని తీసుకొని ఒక చిన్న బౌల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా పది నిమిషాల పాటు బాగా మరిగించి చల్లారాక జుట్టుకు అప్లై చేయాలి. ఇలా జుట్టుకు అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు మసాజ్ చేసి సాధారణ షాంపుతో శుభ్రం చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. కాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయి.


నిమ్మ, కొబ్బరి నూనె:
రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టిస్తే జుట్టు అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి. తరచుగా జుట్టు రాలడం, జుట్టు పొడి వారడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ రెసిపీని వినియోగించండి.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook