Blood Clots: వీటిని ప్రతిరోజు తీసుకుంటే.. గుండెపోటు, నరాల్లో బ్లడ్ క్లాట్ సమస్యలు కేవలం 50 రోజుల్లోనే మాయం!
Blood Clot Risks: శరీర భాగాల్లో బ్లడ్ క్లాత్ అవ్వకుండా ఉండాలంటే కాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను కూడా ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది.
Blood Clot Risks: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ గుండెపోటు సైలెంట్ గా వ్యాపిస్తుంది. ప్రస్తుతం చాలామంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు వచ్చే ముందు శరీరంలో చాలా రకాల మార్పులు జరిగినప్పటికీ ఆ మార్పులపై ఎవరు శ్రద్ధ తీసుకోవడం లేదు. ముఖ్యంగా చాలామంది వాటిపై అజాగ్రత్తగా ఉంటున్నారు. ఇలాంటి కారణాలే ప్రాణాంతకం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ లు రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, అధిక బరువు పెరగడం, నిద్ర లేకపోవడం, తీవ్ర మధుమేహం సమస్యలు, గుండెల్లో మంట, శారీరిక శ్రమ లేకపోవడం, మద్యపానం సేవించడం, ధూమపానం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడి చివరకు గుండెపోటు సమస్యలు తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
ఇవే కాకుండా ప్రస్తుతం చాలామందిలో గుండెపోటు వచ్చే ముందు కొత్త సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా శరీరంలో రక్తం పలు అవయవాల్లో పేరుకుపోయి గడ్డలు కట్టుకుని పోతుంది. దీన్నే మనం బ్లడ్ క్లాట్ అని కూడా పిలుస్తున్నాము. దీనికి కారణంగా కూడా చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయని ఇటీవల వైద్యులు ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
రోజు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి:
ప్రతిరోజు తీసుకునే ఆహారానికి ముందు రెండు టీ స్పూన్ల వెల్లుల్లి రసాన్ని తాగాల్సి ఉంటుంది. తాగడం వల్ల రక్తం గడ్డకట్టకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దరిదాపుల్లోకి రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండెపోటు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఖాళీ కడుపుతో ద్రాక్ష రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ రసంలో చాలా రకాల పోషకాలు లభిస్తాయి కాబట్టి కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి.
రెడ్ వైన్ కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఈ వైన్ ని తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య దంపతులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook