Reduce Breast Cancer Risk: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' జరుపుకుంటారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా మందిలో క్యాన్సర్‌తో పాటు స్త్రీలు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఈ క్యాస్సర్ నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ.. ధూమపానానికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపులున్నారు. అంతేకాకుండా కొన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్‌ను నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

పచ్చని ఆకు కూరలు ఎప్పుడు శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయని  నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్‌లో ప్రచురించారు. అంతేకాకుండా ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు ఎక్కువగా తినే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అందులో పేర్కోన్నారు.


బీన్స్:
బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ చాలా పోషకాలు లభిస్తాయి. ఇది రొమ్ము క్యాన్సర్‌ను నివారించడమే కాకుండా.. ఇప్పటికే ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళల బరువు నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.


క్రూసిఫరస్ కూరగాయలు:
మహిళలు తప్పనిసరిగా క్రూసిఫెరస్ కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఐసోథియోసైనేట్, ఇండోల్స్ అనే ఫైటోకెమికల్స్ క్యాన్సర్‌ కాణాలను తగ్గించేందుకు సహాయపడతాయి.


కొవ్వు చేప:
ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా మహిళలు సాల్మన్, సార్డిన్, మాకేరెల్ వంటి చేపలను తినాల్సి ఉంటుంది.


అల్లియం కూరగాయలు:
అల్లియం కూరగాయలలో ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ నివారణలను నిర్ధారించలేదు.)


Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!


Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook