Broccoli Salad Recipe: బ్రోకలీలో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ కె, ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్‌ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు ఎముకలను కూడా ఆరోగ్యవంతంగా చేస్తాయి. దీంతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ బ్రోకలీని సలాడ్‌లా తయారు చేసుకుని తీసుకుంటే మరెన్నో బోలెడు లాభాలు పొందుతారు. అయితే ఈ బ్రోకలీ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రోకలీ సలాడ్‌కి కావాల్సిన పదార్థాలు:
1 బ్రోకలీ 
1/2 కప్పు చిన్న ముక్కలుగా చేసిన క్యారెట్
1/4 కప్పు చిన్న ముక్కలుగా చేసిన కాబేజీ
1/4 కప్పు స్వీట్ కార్న్
1/4 కప్పు చిన్న ముక్కలుగా చేసిన మొక్కజొన్న
1/4 కప్పు క్రాన్బెర్రీస్, అంజీర్ ముక్కలు 
1/4 కప్పు మయోన్నైస్
1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
ఉప్పు రుచికి తగినంత
నిమ్మరసం రుచికి తగినంత
తరిగిన పార్స్లీ


తయారీ విధానం:
బ్రోకలీ సలాడ్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓ బౌల్‌ తీసుకుని అందులో ఈ ముక్కలు నీటిని వేసుకుని 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మరో బౌల్‌ తీసుకుని అందులో ఉడికించిన బ్రోకలీకి క్యారెట్, కాబేజీ, స్వీట్ కార్న్, మొక్కజొన్నతో పాటు క్రాన్బెర్రీస్, అంజీర్ ముక్కలు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.
ఆ తర్వాత డ్రెస్సింగ్ కోసం..ఒక బౌల్‌లో మయోన్నైస్, వెల్లుల్లి పేస్ట్, నల్ల మిరియాలు, ఉప్పుతో పాటు నిమ్మరసాన్ని కలిపి మిశ్రమలా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న డ్రెస్సింగ్‌ మిశ్రమాన్ని కట్‌ చేసుకున్న కూరగాయల్లో వేసుకుని మిక్స్‌ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే  పార్స్లీ వేసుకుని మిక్స్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోండి. 


చిట్కాలు:
బ్రోకలీ సలాడ్‌ను మరింత హెల్తీగా తయారు చేసుకోవడానికి ఇతర కూరగాయలను కూడా వినియోగించవచ్చే. అలాగే ఇందులో దోసకాయను యాడ్‌ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్‌ పొందుతారు.
ఈ సలాడ్‌ మరింత టెస్టీగా ఉండడానికి ఇందులో బ్లాక్‌ పెప్పర్‌ పౌడర్‌ను కూడా వినియోగించవచ్చు. దీంతో పాటు లేత బీన్స్‌ వినియోగిస్తే అద్భుతమై టేస్ట్‌ పొందుతారు.
డ్రెస్సింగ్‌లో భాగంగా ఆలివ్ ఆయిల్, హెల్తీ వినెగర్‌ను ఉపయోగించవచ్చు. దీని వల్ల కూడా రుచి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ సలాడ్‌ను ముందుగా తయారు చేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. సర్వ్ చేసే ముందు బాగా మిక్స్‌ చేసుకుని తినండి. 


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.