Cabbage Health Benefits: క్యాబేజీ ఒక సాధారణ కూరగాయ అయినప్పటికీ, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది దీని వాసన కారణంగా దీన్ని ఇష్టపడకపోవచ్చు, కానీ క్యాబేజీని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన పోషకాలను పొందవచ్చు. ఇందులో లభించే విటమిన్, మినరల్స్‌ ఇతర పోషక విలువలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే క్యాబేజీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాబేజీ తినడం వల్ల కలిగే  ప్రయోజనాలు:


క్యాబేజీలో సల్ఫోరఫేన్, కాయెంఫెరాల్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఆహారంలో దీని తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ లక్షణాలతో పాటు క్యాబేజీలో  విటమిన్ సి పుష్కలంగా లాభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో మంచిది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి సమస్యలతో బాధపడేవారు క్యాబేజీ తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు తగ్గుతాయని కంటి నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. క్యాబేజీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.


గుండె సమస్యలతో బాధపడేవారు క్యాబేజీ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు క్యాబేజీలో ఆంథోసయానిన్స్‌ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల గుండె సమస్యలు కలగకుండా ఉంటాయి. అలాగే క్యాబేజీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అలాగే  గాయాలు నుంచి రక్తస్రావాన్ని ఆపుతుంది. క్యాబేజీలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అలాగే అధిక బరువు సమస్య కారణంగా బరువు పెరుగుతుంటారు. బరువును తగ్గించడంలో క్యాబేజీ మంచి ఆహారం. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి, ఇవి ఆల్కహాల్ వల్ల కలిగే నష్టం నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.


అయితే క్యాబేజీ సాధారణంగా చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం, కానీ కొంతమంది దానిని తినడం మానుకోవాలి.


క్యాబేజీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది కడుపు ఉబ్బరం, వాయువు, అతిసారం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటే.
ఈ క్యాబేజీలో గోయిట్రోజెన్లు అధికంగా ఉంటాయి, ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును అడ్డుకుంటాయి. మీకు హైపోథైరాయిడిజం లేదా ఇతర థైరాయిడ్ సమస్యలు ఉంటే, క్యాబేజీ తీసుకోవడం వల్ల లక్షణాలు మరింత దిగజారవచ్చు. కొంతమందికి క్యాబేజీకి అలెర్జీ ఉండవచ్చు, దీని వల్ల దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఆహార అలెర్జీలు ఉంటే, కొత్త ఆహారాన్ని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.


మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే, క్యాబేజీని మీ ఆహారంలో చేర్చడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. ఆహారంలో పోషకాలను పొందడానికి ఇతర ఆకుకూరలను చేర్చడం చాలా ముఖ్యం. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి