Castor oil for hair growth: జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఆయన కానీ హెయిర్ ఫాల్స్ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సరైన జీవన శైలి, హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం. అయితే ఆముదం నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య ఆగిపోతుంది. ఆముదం నూనెను కొబ్బరి నూనెలో కలిపి జుట్టు అంతా అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ రెమిడీ. జుట్టు పెరుగుదలకు ఆముదం కొబ్బరి నూనె ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆముదం నూనెను రైసిన కమనీస్ అనే గింజల నుంచి తయారు చేస్తారు. వీటిని వడకట్టి ఆవిరి చేసి రైసిన్ అనే విషపూరిత వ్యర్థాన్ని తీస్తారు. అందుకే వడకట్టిన గింజలను వచ్చిన నూనె ఉపయోగిస్తారు. ఆముదం నూనె జుట్టుకు మాయిశ్చర్ ని అందిస్తుంది. ఆముదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫాలికల్స్ కి పోషణ అందిస్తాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కుదుళ్లపై ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది.


ఇదీ చదవండి: అరటి పండ్లతో మీ గుండె పదికాలలాపాటు పదిలం.. ఎలానో తెలుసా?


సాధారణంగా కొబ్బరి నూనెను సౌందర్యపరంగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెను జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టుకు మాయిశ్చర్ ని అందిస్తుంది. జుట్టును మృదువుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొబ్బరి నూనెను ఆముదం నూనెతో కలిపి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. కొబ్బరి నూనె ఆముదం నూనెను రెండు సమపాళ్లలో కలిపి కుదుళ్లకు అప్లై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. మంచి పోషకాన్ని అందిస్తుంది. 30 నిమిషాల పాటు కుదుళ్లకు అప్లై చేసుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.


ఇదీ చదవండి: తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చిట్కా..


ఒక భాగం కొబ్బరి నూనె, మరో భాగం ఆముదం నూనె తీసుకొని రెండింటిని మిక్స్ చేయాలి. తక్కువ మంటపై వేడి చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే రోజ్మెరీ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి ఒక 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి
వారానికి ఒకసారి ఇలా తలకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల అతి తక్కువ సమయంలోనే విపరీతంగా జుట్టు పెరుగుతుంది. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అలాగే వదిలేయొద్దు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆముదం నూనె మొదటిసారి ప్రయత్నిస్తున్నట్లయితే మొదటగా ఆ సౌందర్యపుల సూచన మేరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి