Chanakya Niti: చాణక్య నీతి.. ఆ మూడింటికి దూరంగా ఉండకపోతే కెరీర్ నాశనమే..
Chanakya Niti: ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి విజయానికి అతని యవ్వనంలోనే పునాది పడుతుంది. కాబట్టి ఆ సమయంలోనే మంచి నడవడిక, కష్టపడే తత్వం, నిజాయితీని అవరుచుకుంటే జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు.
Chanakya Niti: జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని.. గౌరవప్రదమైన జీవితం గడపాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే అందుకు తగినట్లుగా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తారు. స్వయంకృషి, పట్టుదల, ఓర్పు.. ఈ మూడు గుణాలతో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొందరు చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిసై జీవితాన్నే నాశనం చేసుకుంటారు. ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి విజయానికి అతని యవ్వనంలోనే పునాది పడుతుంది. కాబట్టి ఆ సమయంలోనే మంచి నడవడిక, కష్టపడే తత్వం, నిజాయితీని అవరుచుకుంటే జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. అదే సమయంలో.. ఒక మనిషి తన జీవితంలో లేదా కెరీర్‌లో విజయం సాధించాలంటే మూడింటికి దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యసనం: అది మందు లేదా డ్రగ్స్ లేదా ఇంకేదైనా చెడు వ్యవసనం కావొచ్చు. చెడు వ్యసనం మనిషిని మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తుంది. తద్వారా కెరీర్‌పై దృష్టి సారించలేరు. అనుకున్న పనుల్లో విజయం సాధించకపోగా అపకీర్తి, అవమానం వెంటాడుతుంది. కాబట్టి చెడు వ్యసనాలను త్యజిస్తేనే జీవితంలో ముందుకు వెళ్తారు.
సోమరితనం: సోమరితనం మహా చెడ్డది. వ్యక్తికి ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. సోమరితనం దాన్ని మరుగున పడేస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న వ్యక్తి కష్టించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అంతేకానీ సోమరితనంతో బద్దకంగా ఉండరాదు. ఒకవేళ సోమరితనాన్ని జయించకపోతే జీవితమంతా బాధపడాల్సి వస్తుంది.
చెడు సహవాసాలు: యవ్వనంలో చెడు సహవాసాలు వ్యక్తిని దారి తప్పేలా చేస్తాయి. లక్ష్యం నుంచి దూరం జరిగేలా చేస్తాయి. విలువైన సమయాన్ని వృథా చేస్తాయి. కాబట్టి చెడు సహవాసాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. అందుకే మంచిని రూపాయి ఇచ్చయినా తెచ్చుకోవాలి.. చెడును రూపాయి ఇచ్చయినా వదిలించుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. ఈ సూచనలు పాటిస్తే వ్యక్తి జీవితం క్రమశిక్షణాయుతంగా ఉండటమే కాదు... జీవితంలో అతను ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
Also Read: World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఏఐజీ సర్వేలో ఆసక్తికర విషయాలు...
Also read: Omar Abdullah: ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఒమర్ అబ్దుల్లా ఫైర్- తప్పులు చూయించారంటూ..
స్తానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook