World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఏఐజీ సర్వేలో ఆసక్తికర విషయాలు...

World Sleep Day: నాణ్యమైన నిద్రకు సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని డా.శ్రీనివాస్ కిశోర్ తెలిపారు. వాటిల్లో ఒకటి గాఢత, రెండు సమయం, మూడు కంటిన్యూటీగా పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 08:04 PM IST
  • నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం
  • ఏఐజీ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
  • సమాజంలో 47 శాతం మంది నిద్రలేమి బాధితులు
World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఏఐజీ సర్వేలో ఆసక్తికర విషయాలు...

World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఓ ఆసక్తికర సర్వేను వెలువరించింది. సమాజంలో రోజురోజుకు నిద్ర సంబంధిత రుగ్మతలు పెరిగిపోవడంపై ఏఐజీ ఆందోళన వ్యక్తం చేసింది. సర్వే ప్రకారం దాదాపు 47 శాతం మంది తగినంత నిద్ర పోవట్లేదని తెలిపింది. నిద్రలేమి వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. 

ఏఐజీ ఈఎన్‌టీ విభాగం డైరెక్టర్ డా.శ్రీనివాస్ కిశోర్ నిద్ర ప్రాముఖ్యతపై మాట్లాడుతూ.. 'నిద్ర అనేది విలాసవంతమైనది కాదు. గాలి, నీరు, ఆహారం లాగే మనుషులకు అదొక జీవ సంబంధమైన అవసరం. మనిషి తగినంత నిద్ర పోకపోతే అది అతని మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఎంతసేపు నిద్ర పోయామన్నది కూడా కాదు. ఎంత క్వాలిటీ నిద్ర అన్నదే ముఖ్యం.' అని పేర్కొన్నారు.

నాణ్యమైన నిద్రకు సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని డా.శ్రీనివాస్ కిశోర్ తెలిపారు. వాటిల్లో ఒకటి గాఢత, రెండు సమయం, మూడు కంటిన్యూటీగా పేర్కొన్నారు. అంటే, ఎంత గాఢంగా, ఎంతసేపు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పోయామన్నదే ముఖ్యమని అన్నారు. స్లీప్ డిజార్డర్స్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరమని.. ఎందుకంటే అవి గుండె సంబంధిత, న్యూరాలజికల్, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక ప్రవర్తనలో మార్పు, బరువు పెరగడం తదితర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని అన్నారు.

మొత్తం 38 స్లీప్ డిజార్డర్స్‌లో అన్నింటికన్నా ఎక్కువ ఆందోళన కలిగించేది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)గా పేర్కొన్నారు. దీని ద్వారా చాలా అనారోగ్య సమస్యలతో పాటు సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. ఏఐజీ పుల్మనాలజీ విభాగం డైరెక్టర్ డా.విశ్వనాథ్ మాట్లాడుతూ... హైవేలపై 40 శాతం రోడ్డు ప్రమాదాలు నిద్ర మత్తు కారణంగానే జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్లీప్ టెస్టింగ్‌లతో ఇలాంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చునని అన్నారు.

Also Read: Krithi Shetty Photos: హోలీ రంగుల్లో కృతిశెట్టి సోయగానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Also Read: Omar Abdullah: ది కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ఒమర్ అబ్దుల్లా ఫైర్​- తప్పులు చూయించారంటూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News