Omar Abdullah: ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధికంగా చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు.. నాణెనికి రెండో వైపు అన్నట్లు వ్యతిరేకత కూడా తీవ్రంగానే ఉంది. చాలా మంది ప్రముఖులు సైతం ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో చూపించిన విషయాలను తప్పుబట్టారు.. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. మూవీలో చాలా విషయాలను తప్పుగా చూయించారని ఆరోపించారు.
ముఖ్యంగా 1990లో కశ్మీర్లో పండిట్లపై దాడులు జరిగిన సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు చూపించారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. అయితే నిజానికి ఆ సమయంలో జమ్ము కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉందని చెప్పారు.
పండిట్లు కశ్మీర్‌కు తిరిగివచ్చేందుకు కృషి చేస్తాం..
ఇక దాడుల్లో కశ్మీర్ పండిట్లు మరణించడం విచారకరమని చెప్పిన ఒమర్ అబ్దుల్లా.. అల్లర్ల కారణంగా ఎంతో మంది మస్లింలు, సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. వలస వెళ్లిన ముస్లింలు చాలా మంది తిరిగి రాలేదన్నారు. కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు తాము కృషి చేస్తామని కూడా వివరించారు. ఇందుకోసం పోరాటం చేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ర్యాలీ నిర్వహించిన ఒమర్ అబ్దుల్లా.. కశ్మీర్ ఫైల్స్ మూవీ అంశాన్ని ప్రస్తావించారు. ఇదివరకే జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మోహబూబా ముఫ్తి, ఫరుఖ్ అబ్దుల్లాలు కూడా స్పందించారు. మూవీపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
Also read: Presidential election 2022: ఉత్కంఠ రేపుతున్న ప్రెసిడెంట్ & వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు..
Also read: Pulwama: పుల్వామాలో ఉగ్ర కుట్ర భగ్నం... ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్...
థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook