Chest Pain Causes: ఛాతి నొప్పి ప్రారంభమైతే గుండెపోటు అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది గుండెపోటు యొక్క ప్రధాన లక్షణం కాబట్టి చాలామంది భయపడతారు. అయితే  ఈ నొప్పి వెనక ఇతర కారణాలు ఉండవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయం తర్వాత చాలామందిలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, ఛాతి నొప్పి సమస్య ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛాతి నొప్పికి ఇతర కారణాలు:
పొడి దగ్గు:

పొడి దగ్గు కారణంగా జాతి కండరాలపై చాలా ఒత్తిడి పడుతుంది. దీంతో కండరాలు బలహీనంగా మారి ఛాతిలో నొప్పి రావచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి దగ్గుతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


ఊపిరితిత్తుల్లో రక్త సరఫరా ఆగిపోవడం:
ఊపిరితిత్తుల్లో కూడా రక్త సరఫరా ఆగిపోతే ఇలాంటి సమస్యలే రావొచ్చు. ధమనుల్లో రక్తం గడ్డకట్టి గుండె సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఊపిరితిత్తులకు గుండెకు మధ్య రక్త సరఫరా ఆగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.


ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్:
ప్రస్తుతం చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వైరస్ కారణంగా చాలామంది ఈ సమస్యలకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఛాతి నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


కోవిడ్ న్యుమోనియా:
కరోనా వైరస్ కు గురైనప్పుడు కూడా జాతి నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి శరీరంలో వివిధ మార్పులు జరిగి.. చాతి నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలా నొప్పుల గురైనప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు   


Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe   


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook