Chinta Chiguru Royyala Curry: ఆంధ్ర స్టైల్ చింత చిగురు రొయ్యల కూర రెసిపీ..
Chinta Chiguru Royyala Curry: చింత చిగురుతో చాలా మంది వివిధ రకాల ఆహారాలు తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని తెలుగు ప్రాంతాల్లో ఎక్కుతగా చింత చిగురుతో రొయ్యలను వండు కుంటారు. అయితే ఈ రోజు చింత చిగురు రొయ్యల కూర రెసిపీని పరిచయం చేయబోతున్నాం.. ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Chinta Chiguru Royyala Curry Recipe In Telugu: చింత చిగురు అనేది భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆకుకూర. ఇవి చింత చెట్టుకు వచ్చే చిన్నని లేత ఆకులు. వీటిని ఆహారాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి ఆహారాల రుచి పెంచడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తాజాగా లేదా ఎండబడిన రూపంలో ఉపయోగించవచ్చు. చింత చిగురులో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల తాజా చిగురులో 5.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా పీచు పదార్థాలు కూడా అధికంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఎ, సి, కె, కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే చాలా మంది చింత చిగురును రొయ్యలతో కలిపి వండుకుంటారు. ఇలా వండుకుని తినడం వల్ల కూడా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా చింత చిగురు రొయ్యల కూరను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి.
చింత చిగురు రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు:
చింత చిగురు - 1 కప్పు
పెద్ద రొయ్యలు - పావు కిలో
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూన్
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - 1 కట్ట
వెల్లుల్లి రేకులు - 5
నూనె - సరిపడా
గసగసాల పొడి - 1 స్పూన్
దాల్చిన చెక్క పొడి - అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 5
కారం - తగినంత
తయారీ విధానం:
చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందులోముందుగా రొయ్యలను శుభ్రం చేసి, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు వేగాక, అందులో రొయ్యలు కూడా వేసి, పచ్చివాసన పోయేవరకు వేయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ రొయ్యలను మూతపెట్టి మరింతసేపు ఉడికించాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇప్పుడు చింతచిగురు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గసగసాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.
ఇందులోనే కాస్త నీళ్ళు పోసి, మూత పెట్టి ఉడికించాలి.
చివరగా కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంతో పాటు వడ్డించాలి.
చిట్కాలు:
చింత చిగురు రొయ్యల కూర రుచి మరింత పులుపు కావాలంటే, చింతచిగురు పొడి ఎక్కువ వేసుకోవచ్చు.
ఇందులో అతిగా కారం వినియోగించవద్దు.
రొయ్యలు ఎక్కువసేపు ఉడికించకూడదు. లేదంటే గట్టిగా అయిపోతాయే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి