Cholesterol Control Tips: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు.. ఇలా 5 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు..!
Cholesterol Control 5 Days: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.
Cholesterol Control 5 Days: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మంది మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పలు రకాల ఆహార నియమాలు పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బెండకాయలను తినడం వల్ల చెడు కొవ్వు నియంత్రణలో ఉంటుంది:
బెండకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా శరీరంలోత చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే మీరు కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా బెండకాయలను ఆహారంగా తీసుకోవాలి.
మధుమేహం వ్యాధి గ్రస్తులకు ఎలా ఉపయోగపడుతుంది:
క్రమం తప్పకుండా బెండకాయలను తినడం వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు వీటి తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కరోనా వైరస్ కారణంగా చాలా మంది రోగనిరోధక శక్తిని కోల్పొతున్నారు. అయితే రోగనిరోధక సమస్యల నుంచి విముక్తి పొందడానికి తరచుగా బెండకాయాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook