Cholesterol Control Home Remedy: నిజంగానే ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?
Cholesterol Control Home Remedy: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడమేనని అరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Home Remedy: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడమేనని అరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తుల, ఔషధాలున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా ఈ చెడు కొలెస్ట్రాల్ కొంతమందిలో గుండెపోటుకు దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తిసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా దీనిని ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
పసుపు శరీరం నుంచి టాక్సిన్స్, కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కృషి చేస్తుంది. దీని కోసం.. రోజువారీ ఆహారంలో పసుపు తప్పకుండా వేసుకోవాలి. లేదా రాత్రి నిద్రిపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉదయాన్నే గోరువెచ్చని నీటితో అర టీస్పూన్ పసుపును వేసుకుని కూడా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వెల్లుల్లి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది:
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకాలుంటాయి. ఇది సల్ఫైట్ సమ్మేళనాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన LDL కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఉదయం, రాత్రి కొన్ని వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటే మంచి ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. అంతేకాకుండా రోజూ వంటలు వండుకునే క్రమంలో కూడా వీటిని వినియోగిస్తే శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Also Read: Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook