Cholesterol Control Tips: చర్మంపై ఇలాంటి సమప్యలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి.. ఇవి చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు.!
Cholesterol Control Tips: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం, థైరాయిడ్, బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్, గుండెపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది వృద్ధుల్లో ఈ సమస్య ప్రాణాంతకంగా మారుతుంది.
Cholesterol Control Tips: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం, థైరాయిడ్, బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్, గుండెపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది వృద్ధుల్లో ఈ సమస్య ప్రాణాంతకంగా మారుతుంది. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ముందుగానే పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా చిట్కాలున్నాయి. ఇవి శరీరంలో కొవ్వును నియంత్రించి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై పలు రకాల సమస్యలు వస్తాయి. అవి సకాలంలో గుర్తించినట్లైయితే.. సులభంగా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొవ్వు పెరిగితే చర్మంపై ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం ఈ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను చూపుతాయి:
చెర్మంపై దురద:
మొదటి లక్షణం ముఖంపై దురద, ముఖంపై చర్మం ఎరుపుగా మారడం. ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించి.. నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం గట్టిగా కావడం:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుకుపోతే చర్మం మందంగా, పొరలుగా తయారవుతుంది. దీని కారణంగా ముఖంపై రంధ్రాలు మూసుకుపోయి. వివిధ రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి లక్షణాలు మీరు ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మొటిమలు రావడం:
అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో మాత్రమే ముఖంపై మొటిమలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ లక్షణాన్ని విస్మరించి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌పై అధికంగా మొటిమలు వస్తే తప్పకుండా వైద్యలను సంప్రదించాలి.
చర్మంపై రంగులో మార్పు:
ఈ లక్షణాలు చాలా మందిలో వస్తున్నాయి. కానీ ఇది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రమే వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. చేతిపై నీలం రంగు దద్దుర్లు కూడా దాని అధిక కొలెస్ట్రాల్ పెరుతుందడానికి లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!
Also Read: IND vs WI 3rd ODI: మూడో వన్డేకు వరణుడి ముప్పు.. మ్యాచ్ కష్టమే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook