IND vs WI 3rd ODI Weather Report: వెస్టిండీస్ గడ్డపై భారత్ సత్తాచాటుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం (జులై 27) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్)లో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తోంది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో ఓడిన విండీస్.. మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. దాంతో మూడో వన్డే కూడా అభిమానులను అలరించే అవకాశం ఉంది.
మూడో వన్డే మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఓ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. మూడో వన్డే మ్యాచ్ జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో బుధవారం ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. ఇక రోజంతా మబ్బులు కమ్మేయనున్నాయి. పగలు 66 శాతం, రాత్రి వేళ 40 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో మూడో వన్డేకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. తొలి రెండు మ్యాచుల్లో ఇదే జరిగింది. పిచ్ కాస్త నెమ్మదిస్తే మాత్రం బౌలర్లు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ మైదానంలో భారత్ ఆడిన చివరి 11 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 220 కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు 181. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ 413. ఈ స్కోర్ కూడా భారత్ చేసింది.
తుది జట్లు (అంచనా):
భారత్: ధావన్ (కెప్టెన్), గైక్వాడ్, శ్రేయస్, దీపక్, శాంసన్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, ఆవేశ్ , చహల్, సిరాజ్.
వెస్టిండీస్: హోప్, బ్రాండన్ కింగ్, బ్రూక్స్, మేయర్స్, పూరన్ (కెప్టెన్), పావెల్, హోల్డర్, అకీల్, అల్జారి జోసెఫ్, మోటీ, సీల్స్.
Also Read: Samyuktha Menon: అలాంటిది ఏమీ లేదు.. త్రివిక్రమ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సంయుక్త మీనన్!
Also Read: Producers Guild: ఫలించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ చర్చలు.. వెనక్కి తగ్గుతున్న హీరోలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook