High Cholesterol Foods to Avoid: రక్తంలోని సిరలు, ధమనుల్లో రక్త చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా  ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధిలు వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధుల కారణంగా ప్రాణాంతకంగా మారే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజు తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలనుకుంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ఈ ఆహారాలు తినొద్దు:
రెడ్ మీట్:

ప్రొటీన్ సమస్యలతో బాధపడుతున్నవారు రెడ్ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు రెడ్‌ మీట్‌ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో మరింత కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతాయి. దీంతో గుండెపోటు తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్


ఫుల్ ఫ్యాట్ మిల్క్:
ప్రస్తుతం చాలా మంది ఆహారాల్లో మిల్క్‌ కేక్‌లు, ఇతర పాల ప్రోడక్ట్స్‌ను అతిగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల కొవ్వులు పెరగడమేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


చక్కెర:
ఆహారాలు రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరగుతాయి. అంతేకాకుండా మధుమేహం సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:
మన దేశంలో ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ఫ్రెంచ్ ఫ్రైస్,  ఫ్రైడ్ చికెన్ తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook