Coconut Benefits: డీ హైడ్రేషన్‌తో పాటు స్థూలకాయం తగ్గించేందుకు అద్భుత ఔషధం
Coconut Benefits: ప్రకృతిలో విరివిగా లభించే అత్యద్భుత ఔషధం కొబ్బరి నీళ్లు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొబ్బరి నీళ్లంటే సాధారణంగా డీ హైడ్రేషన్ కోసమే అనుకుంటారంతా. కానీ స్థూలకాయం తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని మీకు తెలుసా..
Coconut Benefits: ప్రకృతిలో విరివిగా లభించే అత్యద్భుత ఔషధం కొబ్బరి నీళ్లు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొబ్బరి నీళ్లంటే సాధారణంగా డీ హైడ్రేషన్ కోసమే అనుకుంటారంతా. కానీ స్థూలకాయం తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని మీకు తెలుసా..
వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బొండాలు, కొబ్బరి కాయలతో నిండిపోతుంది. కొబ్బరినీళ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. సాధారమంగా కొబ్బరినీళ్లను అనారోగ్యం చేసినప్పుడు లేదా డీ హైడ్రేషన్ సమస్య తలెత్తినప్పుడు లేదా వేసవిలో అయితే దాహం తీర్చుకునేందుకు వినియోగిస్తుంటాము. కానీ కొబ్బరి బొండాలతో డైట్ కంట్రోల్ కూడా సాధ్యమేనని చాలా తక్కువమందికి తెలుసు. కొబ్బరి నీళ్లతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరినీళ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా కొబ్బరినీళ్లు సేవించమని వైద్యులు సూచిస్తుంటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు కొబ్బరి బొండాలకు చాలా డిమాండ్ ఏర్పడుతుంది. కారణం రీ హైడ్రేషన్ సమస్యత పరిష్కారానికి గానీ లేదా వేసవి తాపం చల్లార్చుకునేందుకు ఇవి మంచి ప్రత్యామ్నాయాలు.
కొబ్బరి బొండంతో మరో అద్భుత ప్రయోజనం..బరువు తగ్గడం. నిజమే. కొబ్బరి బొండం నీళ్లు తాగిన తరువాత అందులో ఉండే కొబ్బరిని తినడం మర్చిపోవద్దు. ఫలితంగా శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు లభిస్తాయి. తిండి ఆలోచన తగ్గుతుంది. దాంతో మీకు తెలియకుండానే డైటింగ్ అలవడుతుంది. బరువు తగ్గుతారు. అయితే లేత కొబ్బరిని మాత్రమే ఎంచుకోవాలి. అది కూడా క్రమం తప్పకుండా రోజుకోసారి తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కొబ్బరి నీళ్లు గానీ లేదా కొబ్బరి గానీ ఆకలిని తగ్గిస్తాయి. అందుకే బరువు తగ్గించుకునేందుకు ఇది సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.
Also read; Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook