Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!

Skin Care: బుగ్గలపై గులాబీ రంగు మెరుస్తూ ఉంటే ముఖం ఎంతో సౌందర్యం వంతంగా కనిపిస్తుంది. చర్మం తలతల గులబీ రంగులో మెరిస్తే మనిషి ఆరోగ్య ఉన్నట్లని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Last Updated : Jun 10, 2022, 01:41 PM IST
  • చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..
  • శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లే
  • ఈ చిట్కాలను పాటించండి
Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!

Skin Care: బుగ్గలపై గులాబీ రంగు మెరుస్తూ ఉంటే ముఖం ఎంతో సౌందర్యం వంతంగా కనిపిస్తుంది. చర్మం తలతల గులబీ రంగులో మెరిస్తే మనిషి ఆరోగ్య ఉన్నట్లని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా సౌందర్యం వంతంగా ముఖం ఉంటే..శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కరెక్ట్‌గా ఉంటుందని, కాలేయం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతాలని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మందిలో పింక్ గ్లో తగ్గిపోతుంది. వీటిలో ప్రధాన కారణం చర్మ సంరక్షణ లేకపోవడం, టానింగ్ సమస్య అధికమవ్వడం. అయితే ముఖ చర్మాన్ని తిరిగి గులాబి రంగులోకి తీసుకురావడానికి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ వాడలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ  ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

దీని కోసం కావాల్సి పదార్థాలు:

1. టీస్పూన్‌ గంధపు పొడి
2. టీస్పూన్‌ రోజ్ వాటర్
౩. 1/4 టీస్పూన్ గ్రామ పిండి

తయారు చేయండం ఇలా:

1. ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా చేయండి.

2. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 20 నిమిషాల పాటు అప్లై చేయండి.

3. తర్వాత మంచినీళ్లతో ముఖాన్ని కడుక్కుని మాయిశ్చరైజర్‌తో తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి.

4.  చర్మం పొడిగా ఉంటే..ఈ పేస్ట్‌ను తయారుచేసేటప్పుడు, దానికి పావు టీస్పూన్ తేనె కలపండి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడంతోపాటు ముఖం వికసిస్తుంది.

5. ఫేస్ ప్యాక్ ఆరిపోయినప్పుడు ముఖాన్ని తడిపి, ఆపై వృత్తాకార కదలికలో రుద్ది శుభ్రం చేయండి.

6. ఇలా చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేటర్ అవుతుంది

7. దీని వల్ల  చర్మంపై ఉన్న మృతకణాలు శుభ్రమవుతాయి.

మరకలను తొలగించడానికి ఇలా చేయండి..        
మీ ముఖం వాడిపోయి అలాగే మీ చర్మంపై మచ్చలు కనిపించినట్లయితే, ఈ పద్ధతితో మీ కోసం ఒక ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోండి.

# 1టీస్పూన్‌  గంధపు పొడి
# టీస్పూన్‌ కలబంద జెల్
# 2 నుంచి 2.5 టీస్పూన్ రోజ్ వాటర్
# పావు టీస్పూన్ పసుపు

వీటన్నింటిని మిక్స్ చేసిన తర్వాత, పైన పేర్కొన్న పద్ధతి ప్రకారం తయారు చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై గ్లో పెరుగుతుంది.

Also Read: Sleeping Problem: నిద్ర సమస్యలతో బాధపడుతున్నారా..అయితే రోజూ ఇవి తినండి..!

Also Read: Black Raisins: మీ డైలీ డైట్‌లో అవి చేర్చుకుంటే..వృద్ధాప్య ఛాయలు దరిదాపులకు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News