Coffee Hair Pack For Long Hair: జుట్టు అందంగా ఉంటేనే ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సమస్యలు జుట్టు రాలడం జుట్టు, పొడిబారడం, వెంట్రుకలు చిక్కులుగా అవ్వడం వంటి సమస్యలే అధికం. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా హెయిర్ కేర్ నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. మరికొందరైతే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల తీవ్రత ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఇంటి చిట్కాలతో ఎలా ఉపశమనం పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాఫీ శరీరానికి చాలా మంచిది అందులో ఉండే గుణాలు బాడీకి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అయితే శరీరానికే కాకుండా కాఫీ వెంట్రుకలకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కాఫీ ను ఉపయోగించి ఎలా ఉపశమనం పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కాఫీని ఇలా వాడండి:
శీతాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు కాఫీ పౌడర్ సహాయంతో కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే మీరు దీనికోసం చేయవలసిందల్లా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ వేసి నీటితో మిక్స్ చేయాలి. ఆ తర్వాత అలా తయారు చేసుకున్న స్ప్రేను జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు మరవడమే కాకుండా రాలిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


కాఫీ పౌడర్ తో జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మరో చిట్కా కూడా ఉంది. దీనికోసం ముందుగా అరకప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. జుట్టుకు అప్లై చేసిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు మసాజ్ చేసి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.  20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేయాలి. 



సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కాపీ స్క్రబ్ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్క్రబ్ ని తయారు చేయడానికి ముందుగా రెండు టీ స్పూన్ల కాఫీ ని తీసుకుని రెండు టీ స్పూన్ల తేనెను కలిపి.. జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు వంటి తీవ్ర సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 



(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: IndiGo winter Sale 2023: ₹2వేలకే విమాన టికెట్‌.. ఇండిగో స్పెషల్ ఆఫర్ చూశారా!


Also Read: ఎన్టీఆర్‌‌‌‌కు వెన్నుపోటులో ఆరుగురు మహిళలు.. అప్పటి నిజం బయటపెట్టిన వెంకయ్యనాయుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.