COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coffee Side Effects: కాఫీ వాసన చూడగానే తాగాలనిపిస్తుంది. ఇది అద్భుత రుచిని కలిగి ఉంటుంది. అయితే చాలా మంది మైండ్‌ రిలీఫ్ కోసం కాఫీని తాగుతూ ఉంటారు. ప్రస్తుతం కాఫీ తాగడం మన జీవనశైలిలో భాగంగా అయ్యింది. ఎలాంటి అలసట, ఒత్తిడి వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా కాఫీని తాగుతున్నారు. కాఫీ కొన్ని సందర్భాల్లో తాగడం మంచిదే కానీ అతిగా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువ కాఫీ తీసుకోవడం ఎంత హానికరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కాఫీ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
రక్తపోటు:

అధిక రక్తపోటు ఉన్నవారికి కాఫీ తాగడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల బీపీ రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గుండె జబ్బుకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


పొట్ట సమస్యలు: 
కాఫీ శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కానీ అతిగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గ్యాస్ట్రిక్ హార్మోన్ల సంఖ్యను కూడా పెంచే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో సులభంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు.


నిద్రలేమి:
నిద్రలేమి సమస్య ఉన్నవారు ఎక్కువగా కాఫీ తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిద్రలేకపోవడం కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఎముకలకు హానికలిగిస్తుంది:
కాఫీలో ఉండే కెఫిన్ కొంతమందిలో ఎముకలపై ప్రభావం చూపే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా శరీరంలోని ఎముకలు బలహీనపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల  ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.


ఆందోళన:
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి లోనయ్యే వారు కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు కాఫీని తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరిగి ఆందోళన వంటి సమస్యకు కూడా దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


గుండెల్లో మంట:
కాఫీని అతిగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే గ్యాస్‌ సమస్యలతో బాధఫడేవారు కాఫీని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి