Common Cold Remedies: గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలున్నవారు ఈ సూప్ తాగండి చాలు!
Common Cold Remedies: చలి కాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని హోం రెమెడీస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు నాటు కోడి పులుసు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి.
Common Cold Remedies: భారత్ వ్యాప్తంగా శీతాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా తేమ ఒక్కసారిగా పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో గొంతు నొప్పి, బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ శీతాకాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారు.
దగ్గు, జలుబు నుంచి ఉపశహనం:
వెల్లుల్లి:
చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి దివ్యౌషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే అల్లిసిన్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు లక్షణాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పసుపు నీరు:
పసుపు నీరులో ఔషధ గుణాల అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటి చలి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా దూరం చేస్తాయి. కాబట్టి తరచుగా శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు 2 చిటికెడు పసుపును గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
తేనె:
గొంతు ఇన్ఫెక్షన్‌కు తేనె ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా గొంతులోని సమస్యలను ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడుతుంది. శీతాకాలంలో గొంతు సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.
నాటు కోడి పులుసు:
పూర్వీకులు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి నాటు కోడి పులుసు తీసుకునేవారు. ఈ పులుసులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా నాటు కోడి పులుసు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook