Constipation Home Remedies: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఎండు ద్రాక్ష శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనినే చాలామంది ఇంగ్లీషులో రైసిన్స్ అని అంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు సహాయపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎండు ద్రాక్షలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించి వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఎండుద్రాక్షలో లభించే పోషకాలు:
ఎండుద్రాక్షలో పిండి పదార్థాలు, కేలరీలు, ఆస్కార్బిక్ ఆమ్లం, రైబోఫ్లావిన్, థయామిన్, పిరిడాక్సిన్, ఫైబర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. 


మలబద్ధకం:
రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు తాగితే సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పొట్టలోని భాగాలను శుభ్రం పరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి పొట్ట లోపల భాగాలను కాపాడేందుకు సహాయపడుతుంది. 


అజీర్ణం, గ్యాస్:
అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంతకంటే గొప్ప హోం రెమెడీ ఏదీ లేదు. ఎండు ద్రాక్షలో ఉండే పోషక విలువలు జీర్ణక్రియను వేగవంతం చేసి.. జీర్ణ వ్యవస్థను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.  తరచుగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఔషధం లో పనిచేస్తుంది. కాబట్టి పై సమస్యలు ఉన్నవారు ఎండు ద్రాక్ష నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.


Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌


Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook