Control Hair Fall Oil: హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతున్నారా?, ఇలా 7 రోజుల్లో చెక్!
Control Hair Fall Oil: జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల ఆర్గానిక్ హెయిర్ మాస్క్‌లను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది.
Control Hair Fall Oil: జుట్టు ముఖం అందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో జుట్టు రాలడంతో పాటు, జుట్టు క్రమంగా సన్నబడుతోంది. ఇలాంటి సమస్యల కారణంగా బట్ట తల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమన పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌తో సులభంగా జుట్టు బలంగా, పొడవుగా, ఒత్తుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు:
10 నుంచి 15 వేప ఆకులు
2 టీ స్పూన్ల అవిసె గింజలు
2 టీ స్పూన్ల ఆవాల నూనె
7 లవంగాలు
టీ స్పూన్ కాఫీ పొడి
మాస్క్ తయారి పద్ధతి:
హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో ఒక గ్లాసు నీరు వేసి వేడి చేయాలి.
ఈ నీటిలో వేప ఆకులు, లిన్సీడ్ గింజలు, లవంగాలు, కాఫీ, ఆవాల నూనె వేయాలి.
ఇలా వీటిని వేసిన తర్వాత 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఇలా ఉడికిన నీటిని ఫిల్టర్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ సిద్ధంగా ఉన్నట్లే..
ఈ మాస్క్‌ను వినియోగించే పద్ధతి:
హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ అప్లై చేయడానికి ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత జుట్టుకు ఈ మాస్క్‌ను అప్లై చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత సుమారు 30 నిమిషాలు ఆరనివ్వాలి.
ఆరిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook