Cracked feet: పగిలిన పాదాలను మృదువుగా చేయాలంటే.. ఈ సింపుల్ చిట్కా మీకోసమే..!
Cracked feet home made packs: అమ్మాయిలు ఎంతోమందికి.. ఉందే సమస్య పగిలిన పాదాలు. వాటికోసం క్రీములు వాడడం కన్నా.. ఇంట్లోనే ఎంతో చక్కగా ప్యాక్ చేసుకొని వేసుకుంటే.. వారంలో ఈ పగుళ్లను దూరం చేసుకోవచ్చు. పగిలిన పాదాలను శుభ్రంగా మృదువుగా చేయాలి అంటే.. తేనే, గ్లిజరిన్, రోజ్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తాయి.
Cracked feet Tips: ఈ మధ్యకాలంలో చాలా మంది.. పగిలిన పాదాలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య.. ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మడమల నుంచి రక్తం కారడం.. నడుస్తున్నప్పుడు నొప్పి కలగడం లాంటి విషయాలు ఆడవాళ్లను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. వాస్తవానికి ఆడవాళ్లు ముఖ సౌందర్యం పై పెట్టే దృష్టి.. పాదాల అందంపై అసలు పెట్టరు. ముఖం అందంగా కనిపించడానికి ఎంతో కేర్ తీసుకుంటారు.. కానీ కాళ్లు, పాదాలు విషయంలో మాత్రం కాస్త నెగ్లెట్ చేస్తారని చెప్పాలి. ఫలితంగా మడమలు పగులుతాయి. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. మరి ఈ పగిలిన మడమలు.. తిరిగి మృదువుగా మారాలి.. అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
తేనె:
ఎన్నో ఔషధ గుణాలను.. తనలో ఇమిడి ఉంచుకున్న తేనె.. మడమల పగుళ్లను నయం చేస్తుంది. పగుళ్లను నయం చేయడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా తేనె ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు..ఇందులో ఉండే గుణాలు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
దీనిని ఎలా ఉపయోగించాలి అంటే.. ఒక బకెట్లో సగం వరకు గోరువెచ్చని నీళ్లను తీసుకోవాలి.. ఆ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. తర్వాత మీ పాదాలను ఆ బకెట్ లో వున్న నీళ్ళలో ముంచండి. 20 నిమిషాల తర్వాత మీ పాదాలను కడుక్కుంటే సరిపోతుంది. అయితే ఈ చిట్కాలను మీరు వారానికి ఒకసారి ఫాలో.. అయితే సరిపోతుంది.
గ్లిజరిన్:
పగిలిన మడమలను నయం చేయడంలో గ్లిజరిన్ కూడా చాలా చక్కగా..పనిచేస్తుంది.. ఇది కూడా ఒక గొప్ప మాయిశ్చరైజర్. చర్మాన్ని ఎలాగైతే తాజాగా ఉంచుతుందో.. మడమలను కూడా అంతే శుభ్రంగా.. సున్నితంగా, మెత్తగా మారుస్తుంది. మడమల పగుళ్ల పైన ..ఈ మిశ్రమం పూయడం వల్ల అవి తొందరగా నయం అవుతాయి.
ఇక ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే.. కొద్దిగా గ్లిజరిన్ తీసుకొని అందులో రోజ్ వాటర్ కలిపి.. పాదాలను శుభ్రంగా కడిగి పగిలిన మడమల పైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు వదిలేసి.. ఒక గుడ్డతో తడి లేకుండా తుడవాలి. ఇలా కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే త్వరగా పగిలిన మడమలు శుభ్రంగా అందంగా తయారవుతాయి. ముఖం పైనే కాదు కాస్త పాదాల పైన కూడా శ్రద్ధ పెడితే ఎటువంటి ఇబ్బందులు దరి చేరవు.
Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..
Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి