Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పాదాల్లో పగుళ్ల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు పదాలు కడక పోవడం, పొడిబార‌డం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో కూడా ఈ సమస్యలు వస్తాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఈ సమస్యను ఎవ్వరూ పట్టించుకోరు. అయితే ఇవి ఈ సమస్య తీవ్రమైతే.. పాదాల నొప్పి, అందహీనంగా తయారు కావడం వంటి సమస్యలు వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పాదాల సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఇంట్లో లభించే క‌రివేపాకు, గోరింటాకు వినియోగించిన సమస్య నుంచి బయటపడొచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఎన్నో ఔష‌ధ గుణాలుంటాయి. ఇవి పదాలను మృదువుగా, అందంగా చేసేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలా ప్రయోజనాలను చేకూర్చుతుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో వీటి గురించి విస్తృతంగా అభివర్ణించారు.



ఈ రెండింటిని ఉపయోగించి పాదాల పగుళ్ల సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం క‌రివేపాకును, గోరింటాకు తీసుకుని శుభ్రం చేసుకొవాలి. ఆ తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకొని.. ఇందులో కొన్ని లేత మర్రి చెట్టుకు సంబంధించి ఊడలు తీసుకుని, పాలు వేసి మళ్లీ ఒక సారి మిక్స్‌ చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని రాత్రి పడుకునే మందు పాదాలకు పట్టించి పడుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పాదాలను శుభ్రంగా కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాల సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా పాదాల ప‌గుళ్లు త‌గ్గి, పాదాలు పొడిబార‌డం సమస్యలు దూరమవుతాయి.



Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.